లక్ష్మీదేవి కటాక్షం ఉండాలే గానీ అదృష్టం ఎటువైపు నుంచి తలుపు తడుతుంది అన్నది ఊహకందని విధంగానే ఉంటుంది. ఏంటో చాలామంది మమ్మల్ని కటాక్షించు తల్లి అంటు లక్ష్మీదేవికి పూజలు చేస్తూ ఉంటారు.. ఇక అదృష్టం ఎప్పుడు వర్తిస్తుందా అని ఆశగా వేయికళ్లతో ఎదురుచూస్తూ ఉంటారు. అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఎంతో చిత్ర విచిత్రమైన పనులు కూడా చేస్తూ ఉంటారు. కానీ ఎందుకో  కొంత మందికి మాత్రం అనుకోని విధంగా అదృష్టం వరించడం జరుగుతూ ఉంటుంది. కేవలం రాత్రికి రాత్రే కోటీశ్వరుడుమారి పోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఇలా రాత్రికి రాత్రే కోటీశ్వరుడు గా మారి పోవడం మాత్రం లాటరీ ద్వారా సాధ్యమవుతుంది అనే చెప్పాలి.


 ఎంతో మంది సామాన్యులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి లాటరీలు కొనుగోలు చేయడం చేస్తూ ఉంటారు  ఇలా లాటరీ కొనుగోలు చేసి ఎంతోమంది నిరాశ చెందుతూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం లాటరీలో ప్రైజ్ మనీ గెలుచుకొని అదృష్టవంతులుగా మారి పోతూ ఉంటారు. ఇలా లాటరీ ద్వారా ఎంతోమంది కోటీశ్వరుడు గా మారిపోతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. అతడు కనీసం లాటరీ కూడా కొనుగోలు చేయలేదు.


 కానీ అతనికి అదృష్టం తలుపుతట్టింది. ఏకంగా ఒక్క రాత్రి లో కోటీశ్వరుడు గా మారి పోయాడు. ఈ ఘటన యూఎస్లోని మసాచుసెట్స్ లో చోటు చేసుకుంది. అలెగ్జాండర్ మెక్లేస్ అనే వ్యక్తి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకుని ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు.  ఇక స్నేహితుడు తొందరగా కోలుకోవాలని ఒక వ్యక్తి గెట్ వెల్ సూన్ అంటూ ఒక లాటరీ టికెట్ మీద రాసి పంపించాడు. ఇక చివరికి అదృష్టం వరించింది. ఆ లాటరి టికెట్ ప్రైస్ మనీ గెలుచుకుంది. ఏకంగా 7.5 కోట్ల రూపాయలు వచ్చాయి. దీంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: