కరోనా వైరస్ ఈ పేరు చెబితే చాలు భారత ప్రజలు అందరి వెన్నులో వణుకు పుడుతుంది. ఎందుకంటే ఇండియాలో అంతలా అల్లకల్లోల పరిస్థితులు సృష్టించింది ఈ మహమ్మారి వైరస్. మొదటి దశ కరోనా వైరస్ ను భారత్ ఎంతో సమర్థవంతంగా ఎదుర్కొంది. అగ్రరాజ్యాల తో పోల్చి చూస్తే ఎక్కువ జనాభా ఉన్న భారత్ కరోనా వైరస్ ను ఎంతో వ్యూహాత్మకంగా కట్టడి చేసింది అని చెప్పాలి. కానీ రెండవ దశ కరోనా వైరస్ వేగాన్ని మాత్రం ఊహించలేదు. దీంతో భారత్లో విపత్కర పరిస్థితులు వచ్చాయి. ఆ తర్వాత కఠిన ఆంక్షలు అమలులోకి తీసుకు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వాలు చివరికి రెండో దశ  వైరస్ ను కట్టడి చేశాయ్.


 ఈ క్రమంలోనే అటు వాక్సినేషన్ పై కూడా ప్రజలందరిలో అవగాహన తీసుకువచ్చి ఇక ప్రతి ఒక్కరూ టీకా లు వేసుకునేందుకు ముందుకు వచ్చే విధంగా చేశాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ క్రమంలోనే ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు ఎక్కువ శాతం మంది వ్యాక్సిన్ వేసుకున్నారు అని చెప్పాలి. అయితే ప్రస్తుతం మూడవ దశ కరోనా వైరస్ ముంచుకొస్తోన్న నేపథ్యంలో ఇక రెండు డోసుల వ్యాక్సిన్లు వేసుకున్న వారు బూస్టర్ డోసు ఇస్తారేమో అని ఆశగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బూస్టర్ డోసు ఇస్తే బాగుంటుంది అంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయ్. ఈ క్రమంలోనే ఇటీవల దేశంలో ఓ ఓమిక్రాన్  వేరియంట్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆరోగ్య సిబ్బంది ఫ్రంట్లైన్ వర్కర్లకు బూస్టర్ డోసు ఇచ్చే అవకాశం ఇవ్వాలి అంటూ ఇటీవల ఆంధ్రప్రదేశ్ కర్నాటక కేరళ ప్రభుత్వాలు కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి.


 ఈ క్రమంలోనే ఇక ఈ విజ్ఞప్తిని అటు కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తుంది అని అనుకున్నారు అందరు. కానీ ఊహించని విధంగా కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో మూడు రాష్ట్రాల ప్రభుత్వాలకు కూడా  షాక్ ఇచ్చింది. బూస్టర్ డోస్ అవసరమని మీకు ఎవరు చెప్పారు అంటూ కేంద్ర ప్రభుత్వం ఎదురు ప్రశ్నించడం గమనార్హం. ఒకవేళ ఐసీఎంఆర్ కేంద్రానికి బూస్టర్ డోస్ గురించి సిఫార్సు చేస్తే అప్పుడు ఈ విషయంపై ఆలోచిస్తాము అంటూ కేంద్రం తెలిపింది. దీంతో కేంద్రం బూస్టర్ డోస్ పై విజ్ఞప్తి చేసిన మూడు రాష్ట్రాల ప్రభుత్వాలకు షాక్ తగిలింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: