అసలు కొవిడ్ నిబంధనలు పాటిస్తున్నారా... ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే మాట. దాదాపు రెండేళ్ల క్రితం చైనా దేశంలో పురుడు పోసుకున్న కరోనా వైరస్... ప్రపంచాన్ని ఇప్పటికీ పట్టి పీడిస్తోంది. దాదాపు రెండు నెలల పాటు ప్రపంచం స్తంభించిపోయింది. లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. చివరికి కొవిడ్ నిబంధనలు పాటిస్తూ నెమ్మదిగా ప్రజలు తమ రోజు వారి కార్యక్రమాలు ప్రారంభించారు. ప్రతి ఒక్కరు మాస్క్ తప్పని సరిగా ధరించాలి. భౌతిక దూరం పాటించాలి. శానిటైజర్ తప్పని సరిగా వినియోగించాలి. ఈ మూడు నిబంధనలను ప్రతి ఒక్కరు పాటించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ మొదలు అన్ని దేశాలు కూడా సూచిస్తున్నాయి. ప్రజల్లో నిర్లక్ష్యం తరిమికొట్టేందుకు మాస్క్ ధరించని వారికి జరిమానా విధించాలని కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే భౌతిక దూరం పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని కూడా హోమ్ శాఖ మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఇప్పుడు కొత్తగా ఓమిక్రాన్ వేరియంట్ వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. పైగా అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుందని కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరికలు కూడా చేసింది.

గతేడాది మార్చి నెల నుంచి దేశ వ్యాప్తంగా కొవిడ్ నిబంధనలు అమలులో ఉన్నాయి. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తూనే ఉన్నారు. రాత్రి 9 గంటలకు అన్ని దుకాణాలు మూసి వేయాలి. 10 గంటలకు అందరూ ఇళ్లకు చేరుకోవాలి. కానీ ఇవన్నీ ప్రస్తుతం కాగితాలకే పరిమితం అయ్యాయి. ఈ ఆదేశాలు ఎక్కడా అమలు కావటం లేదు. రాత్రి 12 గంటల తర్వాత కూడా ప్రజలు యదేచ్ఛగా తిరిగేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే... సెకండ్ షో సినిమా చూసి ఇంటికి వెళుతున్నారు. ఇక మాస్క్ అనేది ఏ మాత్రం పెట్టుకోవడం లేదు. చివరికి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా మాస్క్ ధరించటం లేదు. పైగా రాష్ట్రంలో ర్యాలీలు, సభలు జరుగుతూనే ఉన్నాయి. అన్ని పాఠశాలలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు థియేటర్లు కూడా వంద శాతం అనుమతిస్తున్నారు. ఇక కొవిడ్ నిబంధనలు ఎక్కడ అమలు అవుతున్నాయనే అనుమానాలు ప్రజల్లో వెల్లువెత్తుతున్నాయి కూడా.


మరింత సమాచారం తెలుసుకోండి: