తెలుగుగడ్డ పై కమ్మ సామాజిక వర్గం ఎన్నో సంచలనాలకు వేదిక అయింది. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ హీరోలలో 70 శాతం మంది ఈ సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారు. దర్శకులతో పాటు నిర్మాతలు టెక్నీషియన్ లు కూడా ఈ వర్గం నుంచి ఎక్కువ మంది ఉన్నారు. ఇక ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని పెట్టాక కమ్మ సామాజిక వర్గం రాజకీయంగా కూడా తన ఆధిపత్యాన్ని చాటుకుంటూ వచ్చింది. అంతకు ముందు కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది నేతలు ఉన్న కూడా రాజకీయంగా రెడ్లే ఆధిప‌త్యం చ‌లాయిస్తూ వచ్చారు. ఎప్పుడు అయితే ఎన్టీఆర్ పార్టీ పెట్టారో కమ్మలు నాటి సమైక్య రాష్ట్రంలో తెలుగు తిరుగులేని హ‌వా చలాయించా రు.

అయితే ఇపుడు మాత్రం వారిని అన్ని రకాలుగా ఇబ్బందులు కట్టకట్టుకుని వచ్చిన‌ట్టే క‌న‌ప‌డు తున్నాయి. ఈ సామాజిక వ‌ర్గంలో కూడా త‌మ ఆధిప‌త్యం త‌గ్గిపోతోంద‌న్న మ‌ద‌నం అయితే మొద‌లు అయ్యింది. ఇక తెలంగాణ లో ఇప్పుడు టీఆర్ ఎస్ ప‌దేళ్లుగా అధికారంలో ఉంది. ఆ త‌ర్వాత వ‌స్తే కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తుందే త‌ప్పా అస‌లు తెలుగుదేశం అక్క‌డ అధికారంలోకి రావ‌డం క‌లే అనుకోవాలి. తెలంగాణ లో క‌మ్మ లు కేవ‌లం ఖ‌మ్మం జిల్లా కు మాత్ర‌మే ప‌రిమితం అయిపోయారు.

ఇక ఏపీ లో కూడా జ‌గ‌న్ అధికారంలో ఉన్నారు. అక్క‌డ టీడీపీ తో పాటు కమ్మ‌లు రాజ‌కీయంగానే కాకుండా.. అన్ని రంగాల్లో వెన‌క‌ప డి విల‌విల్లాడు తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీ లో తెలుగుదేశం విజ‌యం క‌మ్మ‌ల‌కు జీవ‌న్మ‌ర‌ణ స‌మ‌స్య గా మారింది.

ఎలాగైనా క‌మ్మలు అంద‌రూ కూడా మిగిలిన సామాజిక వ‌ర్గాల‌తో పాటు వైసీపీ , జ‌గ‌న్ పై కోపంతో ర‌గులుతోన్న సామాజిక వ‌ర్గాల‌ను ఏకం చేసి టీడీపీ ని అధికారంలోకి తీసుకు రావాల‌ని విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇందు కోస‌మే వారు కొత్త‌గా సోష‌ల్ ఇంజ‌నీరింగ్ స్టార్ట్ చేసిన ప‌రిస్థితి ఉంది. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు ఫ‌లిస్తుందో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: