వాక్సిన్ వేసుకోవాలి, మాస్క్ పెట్టుకోవాలి, ఫీజీకల్ డిస్టెన్స్ పాటిస్తూ తగిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటే క‌రోనా రాద‌ని.. మ‌హ‌మ్మారిని అరికట్ట‌డం ప్ర‌జ‌ల చేతిలో ఉంద‌ని మంత్రి హరీష్ రావు అన్నారు. ఓల్డ్ బోయిన్‌ప‌ల్లిలో బ‌స్తీ ద‌వాఖానాను ప్రారంభించి ఆయ‌న మాట్లాడారు. దేశంలోని మొదటి సారిగా బస్తి దవాఖాన్ ప్రారంభించిన ఘనత మనదే అని తెలిపారు. 15 వ ఆర్ధిక సంఘం హైద్రాబాద్ లో ప్రారంభమైన బస్తి దవాఖాన లను మోడల్ గా తీసుకొని దేశవ్యాప్తంగా ఆమలు చేయాలని సూచించింద‌న్నారు. హైద్రాబాద్ లో బస్తి దవాఖానాలు ప్రారంభమైన తరవాత ఇతర జిల్లాలు నుంచి డిమాండ్ వస్తుంది అని తెలిపారు.


144 బస్తి దవాఖానాల‌ను త్వ‌ర‌లోనే జిల్లాల్లో ఏర్పాటు చేయబోతున్నామ‌న్నారు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అన్ని పరీక్షలు చేస్తున్నామ‌ని, 11 లక్షల మందికి ఉచిత పరీక్షలు చేశామ‌ని రిపోర్ట్స్ నేరుగా మొబైల్ కి వస్తున్నాయని వివ‌రించారు. 4 సూపర్ స్పెషల్టీ ఆసుపత్రిని నిర్మించబోతున్నామ‌న్నారు. ఒక్క ఆసుపత్రి వెయ్యే పడకల సామ‌ర్థ్యంతో ఏర్పాటు చేస్తున్నామ‌ని త్వరలో ఆ సుపత్రులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శంఖుస్టాపన చేయనున్నారని వెల్ల‌డించారు.


ఓమిక్రాన్ అనే కొత్త వైరస్ వచ్చింది అని ప్రజలు భయపడుతున్నారని, ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఎదర్కొవడం కోసం ప్ర‌భుత్వం అన్ని చర్యలు తీసుకుందని తెలిపారు. వాక్సిన్ వేసుకోవడానికి భయప‌డుతున్నార‌ని.. ఇప్ప‌టి వ‌ర‌కు 2 కోట్ల 51 లక్ష మొదటి టీకా వేసుకున్నారని, 2 టీకాలు వేసుకోండి ప్రాణాపాయం ఉండద‌ని ప్ర‌జ‌ల‌కు మంత్రి హ‌రీష్‌రావు సూచించారు. ఇంకా 80 లక్షల వాక్సిన్ స్టాక్ ఉంద‌న్న ఆయ‌న లోకల్ కార్పొరేటర్ ఎన్నికలప్పుడు ఎలా ఓటు కోసం వెళ్లారో, ఒక్కక్క ఇంటికి వెళ్లి మరీ వాక్సిన్ వేయించాల‌ని ఆదేశించారు.


ఓమిక్రాన్ వేరియంట్ ఇంకా మన రాష్ట్రానికి రాలేదు, కర్ణాటక లు వచ్చింది అని కేంద్ర వైద్య అధికారులు చెప్పారన్నారు. 12 దేశాల‌ నుంచి వచ్చే వారికి ఎయిర్‌పోర్ట్ లో టెస్ట్ లో చేస్తున్నామ‌ని, బ్రిటన్ నుంచి వచ్చిన ఓ మహిళకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందని, ఆమె శాంపిల్ జీనామ్ సీక్వెన్స్ కి పంపించామ‌న్నారు. రిపోర్ట్ రావడం కోసం  3 నుంచి 4 రోజులు సమయం పడుతుంది అని తెలిపారు. అలాగే, నేడు తెలంగాణ అమరువీరుడు శ్రీకాంత్ చారి 12 వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు. ఎంతో మంది త్యాగ ఫలితం, ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పట్టుదల , పోరాటం , ప్రాణత్యాగానికి సిద్ధపడటం వలన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని మంత్రి హ‌రీష్ రావు గుర్తు చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: