కాంగ్రెస్‌ను దెబ్బ కొట్టి ప్ర‌తిప‌క్షాల‌ను ఏకం చేసి స‌రికొత్త లీడ‌ర్‌గా అవ‌త‌రిస్తే 2024లో బీజేపీ పై విజయం సాధించి కేంద్రంలో అధికారంలో రావడానికి బెంగాల్ సీఎం మ‌మ‌త పావులు క‌దుపుతోంది. ప్రాంతీయ పార్టీల నాయ‌కులు బీజేపీ, కాంగ్రెస్‌ను వ్య‌తిరేకిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో వారంద‌రు మాత్రం దీదీని అంగీక‌రిస్తున్నారు. అందుకే కాంగ్రెస్ ను దెబ్బ‌తీయాలంటే ప్ర‌తిచోట ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓట్ల శాతాన్ని పెంచుకుంటూ పోతేనే అది సాధ్యం అవుతుంద‌ని ఆమె ఉద్ధేశ్యంగా క‌నిపిస్తోంది. సోనియా గాంధీతో స‌న్నిహిత సంబంధాలు ఉన్న మ‌మ‌త ఈసారి కాంగ్రెస్‌ను దెబ్బ‌కొట్టే వ్యూహాలు ర‌చించ‌డం రాజ‌కీయాల్లో చ‌ర్చగా మారింది.



 ఇక 2022 ఫిబ్ర‌వ‌రిలో ప‌లు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ప్ర‌ధాని మోడీకి ఇత‌ర నాయ‌కుల‌కు ఈ ఎన్నిక‌లు ప‌రీక్ష కానుంది. లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు దీనిని సెమీ ఫైన‌ల్‌గా అన్ని పార్టీలు భావిస్తున్నాయి. ఎందుకంటే ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, పంజాబ్‌లో ఈ ఎన్నిక‌ల‌కు ద‌గ్గ‌ర‌గా ఉండ‌డ‌మే ఇందుకు కార‌ణం. అయితే, బీజేపీకి త‌న త‌ప్పుల‌ను స‌వ‌రించుకోవ‌డానికి చాలా స‌మ‌యం ఉంది. భవిష్య‌త్తు ఎవ‌రికి తెలియ‌దు గ‌నుక మ‌మ‌త బెన‌ర్జీ ఎలాంటి త‌ప్పిదాలు చేయ‌ద‌న్న గ్యారంటీ లేదు.



 ఆమె వైపు నుంచి కూడా ఎన్నో త‌ప్పులు ఉంటాయి. కానీ, ప్ర‌తిప‌క్ష నాయ‌కుల‌తో పోల్చితే ఆమెకు ఉన్న బ‌లహీన‌త‌లు చాలా త‌క్కువే అని చెప్పాలి. కాంగ్రెస్‌కు ఎదుర‌వుతున్న ప్ర‌మాదం ఏంటంటే మ‌మ‌త‌ను అనుకోని ప‌రిస్థితుల్లో రాహుల్ శ‌తృవుని చేసుకుంటున్నారు. సాధార‌ణంగా పార్ల‌మెంట్ స‌మావేశాల ముందు ప్ర‌తిప‌క్షాలు అన్ని స‌మావేశం అవుతుంటాయి. కానీ, ఈ సారి శీతాకాల స‌మావేశాల‌కు ముందు ప్ర‌తిప‌క్షాల స‌మావేశానికి కాంగ్రెస్ మ‌మ‌త‌ను ఆహ్వానిస్తే దానికి ఆమె హాజ‌రు కావ‌డానికి ఆమె ఇష్ట‌ప‌డ‌లేదు. ప్ర‌తిప‌క్షాలు  బ‌తిమిలాడితే త‌ప్ప పార్ల‌మెంట్‌లో స‌హ‌క‌రించ‌డానికి ఒప్పుకుంది. కాంగ్రెస్ త‌మ‌కు పెద్ద‌న్న కాద‌ని తేల్చిచెప్పారు. అయితే, రాజ‌కీయంగా దీదీపై దాడి చేయ‌డానికి కాంగ్రెస్ జంకుతోంది. మ‌రి రానున్న రోజు తృణ‌ముల్ అధినేత్రి వ్యూహాలు ఎలా ఉంటాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: