తెలంగాణలో వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో పార్లమెంట్‌లో టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన శుక్ర‌వారం చేప‌ట్టారు. నిన్న, మొన్న మాదిరిగానే లోక్‌సభ, రాజ్యసభల్లో ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం ప్రకటన చేయాలని టీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేసారు. లోక్‌సభలో ప్లకార్డులను ముక్కలు ముక్కలుగా చింపి విసిరేసి నిరసన వ్య‌క్త‌ప‌రిచారు.  వరి కొనుగోళ్లపై టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు కేంద్రాన్ని నిలదీసారు. ఐదు రోజులుగా తెలంగాణ రైతుల గురించి తాము ఆందోళన చేస్తున్నాం,  తెలంగాణలో వరి ధాన్యం కొంటారా? కొనరా? అనే విషయంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని నామా నాగేశ్వరరావు ఇవాళ రాజ్య‌స‌భ‌లో తీర్మానంను ప్ర‌వేశ‌పెట్టారు. అయితే ఆ తీర్మాణాన్ని మాత్రం వాయిదా వేసారు.

రాజ్య‌స‌భో ఇవాళ ధాన్యం కొనుగోలు పై తెలంగాణ ఎంపీ కేశ‌శ‌రావు, కేంద్ర‌మంత్రి పియూష్ గోయ‌ల్‌పై వాదోప‌వాద‌ను కొన‌సాగాయి. బాయిల్డ్ రైస్ తెలంగాణ నుంచి ఎంత కొంటారో స్ప‌ష్ట‌త ఇవ్వాలని కేశ‌వ‌రావు స్ప‌ష్టం చేసారు. కేంద్ర ప్ర‌భుత్వం గ‌తంలో ప్ర‌తీ గింజ కొంటా అని ఇప్పుడు మాట మార్చ‌డం ఏమిట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. కేవ‌లం యాసంగిలో తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్‌మాత్ర‌మే వ‌స్తుంద‌ని చెప్పారు. అదేవిధంగా గ‌త ఏడాది 94 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల ధాన్యం కొన్నార‌ని వెల్ల‌డించారు కేశవ‌రావు. మ‌రోవైపు వరి కొనుగోళ్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ మండిపడ్డారు.

అయితే ఈ సంవ‌త్స‌రం ఇప్ప‌టివ‌ర‌కు ఖ‌రీఫ్ సీజ‌న్‌లో కేవ‌లం 19ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నులు మాత్ర‌మే కొన్నార‌ని వెల్ల‌డించారు. అదేవిధంగా యాసంగి పంట‌ను వేయ‌క‌ముందే కేంద్రం స్ప‌ష్ట‌త‌ను ఇవ్వాల‌ని కోరారు. మ‌రోవైపు కేంద్ర‌మంత్రి పియూష్ గోయ‌ల్ స‌మాధానం ఇస్తూ.. బాయిల్డ్ రైస్ ఇవ్వం అని గ‌తంలో తెలంగాణ ప్ర‌భుత్వం లేఖ ఇచ్చింది అని స్ప‌ష్టం చేసారు. మ‌ర‌ల ఇప్పుడు రైస్ ఎంత కొంటారో చెప్ప‌మ‌ని పేర్కొన‌డం స‌బ‌బు కాద‌న్నారు. అదేవిధంగా  ఖ‌రీఫ్ పంట పూర్త‌య్యాక యాసంగి పంట గురించి ఆలోచిద్దాం. తొలుత ఖ‌రీఫ్ పంట గురించి మాట్లాడండి. అస‌లు వేయ‌ని పంట గురించి చ‌ర్చిస్తే ఇప్పుడు ఏమి లాభం లేద‌ని పేర్కొన్నారు కేంద్ర మంత్రి పియూష్ గోయల్‌. మొత్తానికి రాజ్య‌స‌భ‌లో ఇవాళ తెలంగాణ ఎంపీ, కేంద్ర మంత్రిల మ‌ధ్య వాదోప‌వాద‌న‌లు కొద్ది సేపు కొన‌సాగాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: