తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఒమిక్రాన్ వేరియంట్ విజృంభ‌ణ నేప‌థ్యంలో మాస్క్ త‌ప్ప‌నిస‌రి చేస్తూ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. మాస్క్ ధ‌రించ‌కుంటే రూ.1000 జ‌రిమానా విధిస్తామ‌ని తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్ట‌ర్ శ్రీ‌నివాస్‌రావు తెలిపారు. తెలంగాణలో క‌రోనా కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నాయి. వ్యాక్సిన్ ఖ‌చ్చితంగా ప్ర‌తిఒక్క‌రూ వేసుకోవాల‌న్నారు. వ్యాక్సిన్ కంటే అత్యంత‌ ర‌క్ష‌ణ క‌వ‌చం మాస్క్ త‌ప్ప‌నిస‌రి పెట్టుకోవాల‌ని స్ప‌ష్టం చేశారు. మూడు రోజుల్లోనే మూడు దేశాల నుంచి 25 దేశాల‌కు వ్యాప్తి చెందింద‌న్న ఆయ‌న వ్యాక్సిన్ ప్రాణాల‌ను ర‌క్షింద‌ని చెప్పారు.


ప్ర‌జ‌ల చెంత‌కు వ్యాక్సిన్లు వ‌స్తున్నాయ‌ని వాటిని సద్వినియోగం చేసుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. హైద‌రాబాద్లో 5.90 ల‌క్ష‌లు, మెడ్చ‌ల్‌లో 4.80 ల‌క్ష‌లు, రంగారెడ్డిలో 4.10 ల‌క్ష‌ల మంది రెండో డోస్ టీకా వేసుకోవాల్సి ఉంద‌న్నారు. తెలంగాణ వ్యాప్తంగా 25 ల‌క్ష‌ల మంది రెండో డోస్ టీకా తీసుకోవాల్సి ఉంది. వీరంతా వెంట‌నే  వ్యాక్సిన్ వేసుకోవాల‌ని డిహెచ్ శ్రీ‌నివాస‌రావు కోరారు. వ్యాక్సిన్  వేసుకోకుంటే ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్టేన‌ని హెచ్చ‌రించారు. ఇక వ్యాక్సిన్ ఖ‌చ్చితంగా వేస‌కోవాల్సిందేన‌ని ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర ప్ర‌భుత్వం.   వ్యాక్సిన్‌పై నిబంధ‌న‌లు ప్ర‌భుత్వం అనుమ‌తితో రూపొందిస్తామ‌ని తెలిపారు. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భార‌త్ లోకి ప్ర‌వేశించిన నేప‌థ్యంలో తెలంగాణ ప్ర‌భ‌త్వం అప్ర‌మ‌త్త‌మ‌యింది.


  హోట‌ల్ పార్క్‌, బ‌హిరంగ ప్ర‌దేశాల‌కు ఎక్క‌డికి వెళ్లిన వ్యాక్సినేష‌న్ మాత్రం ఖ‌చ్చితం చేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. వ్యాక్సిన్ వేసుకోని వారికి త్వ‌రలో నో ఎంట్రి  నిబంధ‌న‌లు తీసుకురానున్న‌ట్టు టీఎస్ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ప్ర‌తి ఒక్క‌రూ మాస్క్ ధ‌రించాల‌ని సూచించింది. అలాగే బ‌హిరంగ ప్ర‌దేశాలతో పాటు, ఆఫీసుల్లో కూడా మాస్క్ త‌ప్ప‌నిస‌రి చేసింది. ఇక రాష్ట్ర ప్రజారోగ్యానికి సంబంధించి హెల్త్ డిపార్ట్‌మెంట్ స‌న్న‌ద్ధ‌త, అనుస‌రిస్తున్న కార్యాచ‌ర‌ణ, రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ టీకాల పురోగ‌తి మందుల ల‌భ్య‌త ఆక్సిజ‌న్ బెడ్స్ సామ‌ర్థ్యం త‌దిత‌ర అంశాల‌పై ఎప్ప‌టికప్పుడు క్యాబినెట్ చ‌ర్చించ‌నుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: