రష్యా అధ్యక్షుడు పుతిన్ ను జిన్ బాగా మోటివేట్ చేసినట్టే ఉన్నాడు. అందుకే అస్సలు ఉక్రెయిన్ విషయంలో వెనక్కి తగ్గనంటుంది. తాను స్వాతంత్ర దేశంగా ఆవిర్భవించిన ఇన్నాళ్లకు మళ్ళీ ఇదేమిటని ప్రశ్నిస్తున్నప్పటికీ రష్యా మాత్రం వినిపించుకునే స్థితిలో లేదు. సరిహద్దులలో 90000 సైన్యంతో రష్యా సిద్ధంగా ఉన్నప్పటికీ, ఉక్రెయిన్ మాత్రం వెనక్కి తగ్గటం లేదు. తన జోలికి వస్తే ఊరుకునేది లేదని గట్టిగానే జవాబు ఇస్తుంది. ఈ విషయంలో ఇతర దేశాలు కూడా ఉక్రెయిన్ వైపు ఉండటంతో రష్యా కు ఆయా దేశాలు కూడా హెచ్చరికలు జారీచేస్తూనే ఉన్నాయి. రష్యా మాత్రం చైనా మాదిరిగా ఇదంతా మా ఆంతరంగిక విషయం అని చెప్పుకొస్తుంది. దానికి ఆయా దేశాలు కూడా ఒక స్వాతంత్ర దేశంపైకి ఆధిపత్యం కోసం వస్తూ, ఆంతరంగిక విషయం అని ఎలా అంటారు అని ప్రశ్నిస్తున్నాయి.

దీనిపై స్పందించిన అమెరికా ను కూడా బెదిరించడానికే ఇటీవల రష్యా తన సుదూర ప్రాంతాలను కూడా నాశనం చేయగలిగే బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించింది. అది విజయవంతం కావడంతో మరోసారి రష్యా తన శత్రువు అయినటువంటి అమెరికాకు పరోక్షంగా పెద్ద హెచ్చరికే ఇచ్చినట్టు అయ్యింది. ఇది చూసుకొని రెచ్చిపోదలిచిన రష్యా కు నాటో దేశాలు కూడా మరోసారి హెచ్చరికలు జారీచేశాయి. ఉక్రెయిన్ జోలికి వస్తే చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టం చేశాయి. ఇలా రష్యా కూడా చైనా మాదిరిగా ఆధిపత్యం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉండటాన్ని చూసి, జిన్ బాగానే పుతిన్ బ్రెయిన్ వాష్ చేసినట్టుగా ఉన్నాడు అని అనుకొకమానరు.

చైనా స్వతహాగా యుద్ధం ఆరంబించలేక, అలా ఆరంభిస్తే భవిష్యత్తులో ప్రపంచం ఎలెత్తి చూపిస్తుందనే ఉద్దేశ్యంతో ఎక్కడో అక్కడ ఒక రగడ జరగాలి, అది చిలికిచిలికి యుద్ధంగా పరిణమించాలి, అప్పుడు తాను కూడా పాల్గొని తన శత్రుదేశాలపై విరుచుకుపడవచ్చు అనే దౌర్భాగ్యమైన వ్యూహాన్ని పన్నినట్టుగా ఉంది. అందుకే రష్యా ను ఉక్రెయిన్ పై ఉసిగొల్పుతూ, యుద్ధ సన్నివేశాలకు ఆజ్యం పోస్తుంది. ఇదంతా చైనా కుట్ర అని అందరికి తెలిసినప్పటికీ, ప్రపంచానికి ఆయుధాలు సరఫరా చేసే రష్యా యుద్ధ భూమిలోకి వస్తే అది ఖచ్చితంగా మూడో ప్రపంచ యుద్దానికి దారి తీసే అవకాశాలే ఎక్కువ అని అనుకుంటున్నారు. అది నిజమే, ఎప్పుడు యుద్ధం ప్రారంభం అవుతుందా, ఎప్పుడెప్పుడు అణు ఆయుధాలు వాడేద్దామా అని చేతులు దురదగా ఉన్న దేశాలు కూడా ఇప్పటి పరిస్థితులలో కూడా ఉన్నాయి మరి. అందుకే కరోనా లో కూడా యుద్ధ సన్నాహాలు చేసుకోవాల్సి వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: