కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఓమిక్రాన్ ప్రపంచ దేశాలను వణికిస్తుంది. ఈ క్రమంలోనే ఈ వైరస్ కేసులు వెలుగు లోకి రాకముందే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన ఆంక్షలు అమలులోకి తీసుకు వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ఎయిర్ పోర్టు వద్ద విదేశాల నుంచి వస్తున్న వారందరికీ కూడా తప్పనిసరిగా పరీక్షలు చేసి నెగటివ్ వస్తేనే ఇక ఎయిర్పోర్ట్ నుంచి బయటకు పంపిస్తున్నారు. ఇటీవల దీనికి సంబంధించి కొత్త రూల్స్ ని అమలులోకి తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఇటీవలే గత కొంత కాలం నుంచి ఏపీలో ఒక వార్త వైరల్ గా మారిపోయింది.



 విదేశాల నుంచి ఏపీకి 30 మంది వచ్చారు అని.. ప్రస్తుతం వారి ఆచూకీ దొరకడం లేదు అంటూ మీడియాలో గత కొన్ని రోజుల నుంచి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇక ప్రస్తుతం కొత్త వేరియంట్ ఓమిక్రాన్  కారణంగా ఎంతోమంది ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇటీవల ఇదే విషయంపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ స్పందిస్తూ  అసలు విషయాన్ని వెల్లడించారు. ఏపీలో అంతర్జాతీయ విమానాశ్రయాలు అస్సలు లేవు అంటూ ఆయన చెప్పుకొచ్చారు.



 విదేశాల నుంచి అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన వారికి కేంద్ర ప్రభుత్వం ప్రోటోకాల్ ప్రకారం ముందుగానే కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు అని ఆయన చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎయిర్పోర్టులో కూడా మెడికల్ టీమ్స్ అందుబాటులో ఉన్నాయని చెప్పాలి. అందరికి టెస్ట్ చేసిన తర్వాతనే ఎయిర్పోర్టు బయటకు పంపుతున్నాము అంటూ తెలిపారు. అయితే విదేశాల నుంచి వచ్చిన 30 మంది ఐసోలేషన్ లోనే ఉన్నారు అంటూ ఆయన చెప్పుకొచ్చారు. వైద్యబృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారని తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన 30 మంది ఆచూకి తెలియడం లేదు అంటూ మీడియాలో వస్తున్న వార్తలను ఎవరునమ్మ వద్దు అని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: