గత కొంతకాలం నుంచి పాకిస్థాన్ లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అన్న విషయం తెలిసిందే.. అయితే ఉగ్రవాదానికి కేరాఫ్ అడ్రస్ అయిన పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషించడమే తప్ప ఆ దేశ ప్రజల సంక్షేమం గురించి గానీ వారి మౌలిక వసతులు గురించి గాని పట్టించుకున్న దాఖలాలు లేవు. ఉగ్రవాదులను పెంచి పోషించడం మత రాజ్య స్థాపన కోసం ఇతర దేశాలపై దాడులు చేయించడం చేస్తూ ఉంటుంది పాకిస్తాన్. అయితే ప్రస్తుతం ఉగ్ర దేశమైన పాకిస్థాన్ పూర్తిగా చైనా చెప్పు చేతుల్లో ఉంది అన్న విషయం తెలిసిందే. ఆర్థిక సహాయం పేరుతో పాకిస్తాన్ కి భారీగా అప్పులు ఇచ్చిన చైనా అవి చెల్లించకపోవడంతో ప్రస్తుతం పాకిస్తాన్ ను తమ చెప్పుచేతల్లో పెట్టుకుంది.



 దీంతో గత కొంత కాలం నుంచి చైనా చెప్పింది చెయ్యడమే పనిగా పెట్టుకుంది పాకిస్తాన్. ఈ క్రమంలోనే ఏకంగా పాకిస్థాన్కు చెందిన ఎన్నో ప్రాంతాలను కూడా చైనాకు అప్ప చెబుతూ ఉండడం గమనార్హం. అయితే ఇక పాకిస్తాన్ ను రోజురోజుకి ఆర్థిక సంక్షోభం చుట్టుముడుతున్నప్పటికీ  పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం దీనిపై ఎక్కడ దృష్టి సారించిన దాఖలాలే లేవు. దీంతో దేశ ప్రజలందరూ కూడా పాకిస్తాన్ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడికక్కడ ఉద్యమాలు చేపడుతు ఉన్నారు.



 ఇలా పాకిస్థాన్లో రోజురోజుకు ఉద్యమాలు పెరిగి పోతూ ఉండటం గమనార్హం అయితే ఎంత ఉద్యమాలు జరుగుతున్నప్పటికీ అటు పాకిస్థాన్ చైనా ప్రభుత్వాలు మాత్రం చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నాయ్. అయితే చైనాకు పాకిస్తాన్ ఆస్తులను తనఖా పెట్టడమే కాదు పాకిస్తాన్ ప్రజల జీవితాలను కూడా తనఖా పెట్టారు  అంటూ ప్రభుత్వ తీరుపై ప్రజలు తిరగబడుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఏకంగా వేల మంది మహిళలు  ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. చైనా పాకిస్తాన్లు చెవులు మూసుకుని ఆస్తులను మాయం చేయడం పైనే దృష్టి పెట్టాయ్ అంటూ విమర్శలు గుప్పించారు. అయితే భారత్ వెనకుండి ఇదంతా చేస్తోందని పాకిస్తాన్ ఆరోపణలు చేస్తూ ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: