నాగరిక సమాజం లోకి అడుగుపెడుతున్న మనుషులు ఎందుకో గాని గుండె ధైర్యాన్ని మాత్రం కోల్పోతున్నారు. ఒకప్పుడు ఎంతటి సమస్యనైనా సరే ధైర్యంగా నిలబడి ఎదుర్కొనే మనుషులు ఇక ఇప్పుడు చిన్నపాటి సమస్యలకే కుంగిపోతున్నారు. చిన్న చిన్న సమస్యలకు ఈ జీవితం వృధా అయిందని భావించి చివరికి బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. నిండు నూరేళ్ల జీవితాన్ని చేజేతులా అర్థంతరంగా ముగిస్తున్నారు ఎంతోమంది. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాల కారణంగా ఇటీవలి కాలంలో పోతున్న ప్రాణాలు ఎన్నో.



 భార్యా భర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి.. చిన్నపాటి కుటుంబ కలహాల తోనే జీవితం వృధా అయి పోయిందని భావించి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇటీవలే సంగారెడ్డి జిల్లా లో కూడా ఇలాంటి ఒక విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది.. క్షణికావేశం ఒక నిండు కుటుంబాన్ని బలి తీసుకుంది. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో కుటుంబ కలహాలతో మనస్థాపం చెంది కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుని బలవన్మరణానికి పాల్పడింది . సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పోలీస్స్టేషన్ పరిధిలోని న్యూ ఎమ్ ఐ సి కాలనీ లో భార్య పిల్లలతో కలిసి చంద్రకాంత్ నివాసం ఉంటున్నాడు..


 హ్యాపీగా ఉన్న వీరి సంసారం లో గొడవలు జరగడం మొదలైంది. భార్య లావణ్య తో గొడవ పడ్డాడు. ఇక్కడ ఇద్దరి మధ్య గొడవపడి మాటా మాటా పెరగడంతో  మనస్తాపం  చెందిన భార్య లావణ్య తన పిల్లలు ఇద్దరిని తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయింది. భార్య వెళ్లిపోవడంతో మనస్థాపం చెందిన భర్త చంద్రకాంత్ చివరికి జీవితం వృధా అని భావించి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక పిల్లలతో బయటికి వెళ్లి లావణ్య ఆందోలు మండలంలోని పెద్ద చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: