కేంద్ర ప్రభుత్వం మిగతా రాష్ట్రాల వారికి కూడా బియ్యం సరఫరా చేయడానికి తెలంగాణ ప్రభుత్వం నుంచి సుమారుగా ప్రతి ఏటా 40 లక్షల టన్నుల బియ్యాన్ని కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే. వరి కొనుగోలు విషయంలో తెలంగాణ గందరగోళం సృష్టిస్తుంది అంటూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మండిపడుతున్నారు. ధాన్యం కొనుగోళ్లపై రాజ్యసభలో కేకే అడిగిన ప్రశ్నకు.. కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ కేకే ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఖరీఫ్‌ సీజన్‌ తర్వాత యాసంగిలో వచ్చే బియ్యం రకం గురించి ఆలోచిద్దామని పీయూష్‌ పేర్కొన్నారు.


ఎప్పుడు చూసినా యాసంగి లో తెలంగాణా నుంచి కేవలం బాయిల్డ్ రైస్ మాత్రమే మనకు వస్తున్నాయని కేకే పేర్కొన్నారు.. కేంద్ర ప్రభుత్వం తినగలిగే బియ్యం కొనేటట్టు అయితే ఎంత కొంటుందో కూడా ముందే క్లారిటీ ఇస్తే రైతులు పండించడానికి కూడా అనుకూలంగా ఉంటుంది కదా అని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వరి వంగడాల రకాల తో సంబంధం లేకుండా వరి కొనుగోలు చేయాలని కోరడం విశేషం. తెలంగాణ ప్రభుత్వం  నుంచి ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు పీయూష్.


సీఎం కేసీఆర్ తో సుమారుగా 50 లక్షల టన్నుల బియ్యం కావాలని కోరడంతో వర్షాకాలం పూర్తిగా ఇస్తామని ఆయన చెప్పారు . అయితే ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం నుంచి కేవలం 32.66 లక్షల టన్నుల బియ్యం మాత్రమే వచ్చింది. మొదట 24 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ కొనడానికి ఒప్పందం జరిగినా.. 44 లక్షల టన్నులకు పెంచామని ఆయన చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు కేవలం 27 లక్షల టన్నుల తినగలిగే బియ్యం మాత్రమే వచ్చిందని.. ఇంకా 17 లక్షల టన్నులు పెండింగ్లో ఉన్నాయని ఆయన తెలిపారు.

బియ్యం కొనడంలో రాజకీయం చేస్తున్న ప్రభుత్వం నుంచి బియ్యం కొనమని ముందే చెప్పామని పీయూష్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా అక్టోబర్ 4వ తేదీన ప్రభుత్వానికి లేఖ రాస్తూ..బియ్యం  పంపమని కూడా పేర్కొంది. ఎందుకు అందరు తినగలిగే యాసంగి దాన్యం విషయంపై తెలంగాణ ప్రభుత్వం రాజకీయం చేస్తోందో అని అర్థం కావట్లేదు అంటూ ఆయన మండిపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: