మాజీ ముఖ్య‌మంత్రి రోశ‌య్య ఈ రోజు అనారోగ్యంతో మృతి చెందారు. నిన్న‌టి వ‌ర‌కు యాక్టివ్ గానే ఉన్న ఆయ‌న ఈ రోజు లో బీపీతో కింద ప‌డిపోయారు. ఆ త‌ర్వాత ఆసుప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గానే మార్గ మ‌ధ్య‌లోనే ఆయ‌న మృతి చెందారు. ఇక గుంటూరు జిల్ల వేమూరులో జ‌న్మించిన రోశ‌య్య వ‌య‌స్సు 89 సంవ‌త్స‌రాలు. ఆయ‌న ప్ర‌ముఖ స్వాతంత్య్ర స‌మ‌ర యోధుడు, క‌ర్ష‌క నాయ‌కుడు ఎన్జీ రంగాకు ప్రియ శిష్యుడు కావ‌డం విశేషం. పొన్నూరు నియోజ‌క‌వ‌ర్గం లోని నిడుబ్రోలు లోని రామానీడు రైతాంగ విద్యాలయములో సహచరుడు తిమ్మారెడ్డితో బాటు రంగా ద‌గ్గ‌ర రాజకీయ పాఠాలు నేర్చుకున్నారు.

ఆ త‌ర్వాత రంగా అండ‌దండ‌ల తోనే ఆయ‌న రాజ‌కీయంగా ఎదిగారు. ముందుగా ఎమ్మెల్సీ అయిన ఆయ‌న ఆ త‌ర్వాత 1979లో టంగుటూరి అంజయ్య ప్రభుత్వంలో రవాణ, గృహనిర్మాణం, వాణిజ్య పన్నుల శాఖల మంత్రి గా ప‌నిచేశారు. రోశ‌య్య అంత త‌క్కువ వ‌య‌స్సులోనే ఉద్దండులు అయిన రాజ‌కీయ నేత‌ల‌ను మించేలా ఎత్తులు వేసేశారు. నాడు కేంద్రం లో ఉన్న కాంగ్రెస్ పెద్ద‌లే రోశ‌య్య రాజ‌కీయ చాతుర్యాన్ని చూసి మెచ్చుకున్న సంద‌ర్భాలు ఎన్నో ఉన్నాయి.

ఆ త‌ర్వాత రోశ‌య్య 1982లో కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభుత్వంలో హోం శాఖ మంత్రి గా ఉన్నారు. ఆ త‌ర్వాత 1989లో మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, రవాణ, విద్యుత్తు శాఖా మంత్రి గా ఉన్నారు. ఆ త‌ర్వాత ఆయ‌న 1991లో నేదురుమల్లి జనార్ధనరెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్తు శాఖా మంత్రి గా ఉన్నారు. ఆ త‌ర్వాత మ‌రోసారి 1992లో కోట్ల విజయభాస్కర రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్తు శాఖలకు మంత్రిగా ఉన్నారు.

ఆ త‌ర్వాత కాంగ్రెస్ ప‌దేళ్లు అధికారంలో లేక‌పోవ‌డంతో ఆయ‌న‌కు ఎక్కువ గ్యాప్ వ‌చ్చింది. తిరిగి 2004, 2009లో వై.యస్. రాజశేఖరరెడ్డి ప్రభుత్వములో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ (ఆర్ధిక ప్రణాళిక)ను ఇప్పటికి 15 సార్లు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభలో ప్ర‌వేశ పెట్టి రికార్డు క్రియేట్ చేశారు. 1995-97 మధ్యకాలంలో ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపిసిసి) అధ్యక్షుడిగా ఉన్న ఆయ‌న‌... 1998లో నరసరావుపేట నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: