సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కొణిజేటి రోశయ్య ఇక లేరు. ఆయన రాజకీయ ప్రస్థానంలో విలువలతో కూడిన హుందాతనం ఉండేది. ఆయా విలువలు పాటించని వారిపై విరుచుకుపడటం కూడా ఉండేది. ఇదంతా రాజకీయంగానే సుమా, సాధారణంగా అయితే ఆయన కూడా శాంతంగా తనపని తాను చేసుకుపోయే మనిషే. కేవలం రాజకీయాలలో ఉన్నప్పుడు తగిన విధంగా ప్రవర్తించాల్సి ఉంటుంది, అదంతా ఆయా బాధ్యతలను బట్టి ఉంటుంది. వాటన్నిటిని ఖచ్చితంగా పాటించడంలో ఆయనకు ఆయనే సాటి. ఎవరో విలువలు పాటిస్తున్నారా లేదా అనేది గమనిస్తూ  వాళ్ళు పాటించనప్పుడు మనకెందుకు వచ్చిన గొడవ అనుకోరు, తన బాధ్యత పట్ల నిబద్దతతో ఉండటం ఆయన వ్యక్తిత్వం.

అందుకే సభలో ఎప్పుడైనా తోటి సభ్యులు ఆయా నియమావళి మరిచి ప్రవర్తిస్తే ఊరుకునే వారు కాదు. ఆయా విషయాలలో మాత్రం కాస్త కాఠిన్యం ప్రవర్తించడం లో కూడా హుందాగా ఉండటం ఆయన ప్రత్యేకత. రాజకీయాలు అంటే ఒకరిపై ఒకరు లేనిపోని విమర్శలు చేస్తుండటం చూస్తుంటాం. అలాంటివి కాకుండా కూడా కొందరు చాలా చక్కగా ఆయా విమర్శలు చేస్తుండటం అక్కడక్కడా చూస్తాం. అందులో ఈయన ఒకరు అని చెప్పవచ్చు. సభా సమయంలో ప్రతిపక్షంలో కూడా తేడాలు ఉంటె వాటిని తనదైన శైలిలో ఎత్తి చూపడానికి వెనుకాడరు. ఎవరైనా సరే కనీస నియమావళి పాటించాల్సిందే, లేకుంటే ఒక్కసారి వీపుమీద చరిచినట్టే గట్టిగా చెప్పడంలో ముందుంటారు.  

ఒకనాడు సభలో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ అధ్యక్షుడిపై కూడా ఇదే తరహాలో విరుచుకుపడ్డారు. దానికి ప్రతిపక్షం నేత కూడా కోపం ఎక్కువ అవుతుంది తగ్గించుకోవాలని సూచించడంతో, దానికి ప్రతిగా స్పందిస్తూ, నాకు కోపం వస్తుంది కాదనను, అది ఎందుకు వస్తుంది అంటే సభా సమయంలో కనీస విలువలు పాటించకుండా లేనిపోని అల్లరి చేస్తుండటం నాకు నచ్చదు. సభలు పెట్టుకుంది ఎందుకు, అందులో చేస్తున్నది ఏమిటి అనేది ఆలోచించినప్పుడు కోపం రాకమానదు అని జవాబు ఇచ్చారు. ఇలా ఆయన తనదైన శైలిలో ఆయా విమర్శలకు కూడా తగిన రీతిలో సమాధానం ఇవ్వడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: