స‌మైక్యాంధ్ర ప్ర‌దేశ్‌కు సీఎం గా ప‌నిచేసిన కొణిజేటి రోశయ్య(89) కన్నుమూశారు. ఈ రోజు ఆయ‌న స్వ‌ల్ప అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. ఈ క్ర‌మంలోనే ఆసుప‌త్రికి త‌ర‌లించే లోగానే ఆయ‌న మృతి చెందారు. ఇక రోశ‌య్య ది సుధీర్ఘ మైన రాజ‌కీయ జీవితం. ఆయ‌న ఎంతో మంది యోధాను యోధుల‌ను కూడా ఎదుర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది ముఖ్య‌మంత్రుల‌కు ఆయ‌న ప్రియ‌మైన శిష్యుడిగా, అనుంగు అనుచ‌రుడు గా ఉండేవారు. ఆయ‌న ప‌ద‌వుల తో పాటు ఇటు బ‌డ్జెట్ ప్ర‌వేశ పెట్ట‌డంలో ఎన్నో రికార్డులు త‌న పేరిట ల‌ఖించు కున్నారు. మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకు అయితే రోశ‌య్య ఎన్నో సార్లు చుక్క‌లు చూపించే వారు.

ముఖ్యంగా 2004 - 2012 లో 8 సంవత్సరాల మధ్య రోశయ్య చంద్రబాబుకు అసెంబ్లీలో చుక్కల చూపించేశారు. తాను పదేపదే సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న వ్య‌క్తి గా చెప్పుకునే చంద్రబాబు ఆర్థిక విషయాల్లో మాత్రం రోశ‌య్య‌ కౌంటర్ లకు బేల చూపులు చూసేవారు. రోశ‌య్య చెప్పే లెక్క‌ల‌కు చంద్రబాబు దగ్గర ఎప్పుడూ ఆన్సర్ లేకుండా పోయేది. 2004 - 2009 సంవత్సరాల మధ్య అసెంబ్లీ లో బలమైన ప్రతిపక్షం గా ఉన్న టిడిపి ఎన్నో సార్లు నాటి ముఖ్యమంత్రి వైఎస్ ను కూడా ఇబ్బంది పెట్టేది.

అయితే రోశయ్య మాత్రం అంకెలతో సహా చంద్రబాబుకు చెంప పెట్టు లాంటి ఆన్సర్లు ఇచ్చేవారు. ఎన్నోసార్లు చంద్రబాబు సైతం రోశ‌య్య గారు అంకెల గారిడీతోనే మమ్మ‌ల‌ను కూడా మాయ చేసేస్తారు అని చెప్పేవారు. ఇక బడ్జెట్ ప్రవేశపెట్టడం లోనూ ... బడ్జెట్ కూర్పులో రోశయ్య ఘ‌నాపాటి గా పేరు పొందారు. రోశ‌జ్ఞ్య‌ కెరీర్లో 15 సార్లు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఘనత ఆయనకే దక్కుతుంది.

అందులో చివరి ఏడు సార్లు వరుసగా బడ్జెట్ ప్రవేశపెట్టడం విశేషం. 2011లో ఆయన రాజకీయాలకు దూరమై తమిళనాడు రాష్ట్ర గవర్నర్గా బాధ్యతలు చేపట్టారు. ప్రధానమంత్రి మోడీ అధికారంలోకి వచ్చినా కూడా రోశ‌య్య‌ను గవర్నర్‌గా కొనసాగించారు. ఈ క్రమంలోనే రోశయ్య 2016 ఆగస్టు 30 వరకు తమిళనాడు గవర్నర్ గా సేవలు అందించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: