ఒక ప్రపంచ స్థాయి టెన్నిస్ క్రీడాకారిణి ని మాయం చేసిన ఘనత చైనాకు దక్కింది. దీనితో ప్రపంచ స్థాయి మహిళా టెన్నిస్ సంస్థ ఇక మీదట చైనా లేదా హాంగ్ కాంగ్ లో ఏవిధమైన ఆట ఆడకూడదని స్పష్టం చేసింది. అంటే టెన్నిస్ సంస్థ చైనా ను నిషేదించినట్టే. చైనా టెన్నిస్ క్రీడాకారిణి పెన్సువై ఆ దేశ ఉపాధ్యక్షుడి మీద లైంగిక ఆరోపణలు చేయడం ప్రపంచం అంతా తెలిసింది. ఆరోజు నుండే ఆమె మాయం అయిపోయింది. అప్పటి నుండి ఆమె తో మాట్లాడాలని తోటి క్రీడాకారిణులు ప్రయత్నిస్తున్నప్పటికీ స్పందించని చైనాలో ఇకమీదట ఏవిధమైన ఆటలు ఆడేది లేదని స్పష్టం చేసేశారు. ప్రపంచ స్థాయి క్రీడాకారినికే చైనా లో ఇలాంటి పరిస్థితి ఉంటె మిగిలిన వారి పరిస్థితి ఏమిటి అని ప్రపంచ మహిళా టెన్నిస్ సంస్థ ప్రశ్నిస్తుంది.

చైనా మొదటి నుండి అతిపెద్ద కమ్యూనిస్టు ప్రభుత్వం అని చెప్పుకుంటూనే కనీసం తన పౌరులకు ప్రాథమిక హక్కులు కూడా కల్పించటం లేదు. అందుకే ఎవరైనా కాలి ఒకమాట ప్రభుత్వాన్ని అంటే వారిని వెంటనే మాయం చేస్తుంది. గతంలో అలీబాబా సంస్థ అధినేత ను మాయం చేసింది. ఇప్పుడు ప్రభుత్వ పెద్ద పై ఆరోపణలు చేసినందుకు టెన్నిస్ క్రీడాకారిణిని మాయం చేసింది చైనా. ఇలాంటి పనులను చేస్తూ, ఒకనాడు భారత్ సురక్షితం కాదు అని చెప్పి విషప్రచారం చేసిన చైనాకు ప్రస్తుతం అదే విషప్రచారం జరిగిపోతుంది. మొన్నటి వరకు కరోనా సృష్టి కర్తగా, ఇప్పుడు లేనిపోని యుద్ధ సన్నివేశాలు రగిలిస్తున్నట్టుగా, అలాగే ఆఫ్ఘన్ విషయంలోనూ తాలిబన్ లను స్వాగతిస్తుండటం, తమ క్రీడాకారిణిని కనిపించకుండా మాయం చేయడం లాంటివి అన్ని చైనా ని ప్రపంచం దృష్టిలో విలన్ గా చిత్రీకరిస్తున్నాయి.

ఇవన్ని భారత్ కు కలిసి వచ్చే అంశాలు, గతంలో తానుగా చేసిన అన్యాయానికి నేను అన్ని తిప్పికొడుతూ, తన గోతిలో తానే పడ్డట్టుగా చైనా పరిస్థితి తయారవుతుంది. ప్రస్తుతం పాక్ ప్రజలు కూడా చైనాపై పీకలదాకా కోపంతో రగిలిపోతున్నారు. ఇవన్నీ ప్రపంచానికి చైనాను చాలా వేగంగా దూరం చేస్తున్న అంశాలు. ఈసారి కావాలని ఆయుధాలు పడితే మాత్రం, అవకాశం వచ్చింది కదా అని అన్ని దేశాలు కలిసి దానిని తుదముట్టించే అవకాశాలు మాత్రం మెండుగా కనిపిస్తున్నాయి. ఆ పరిస్థితి రావాలని కోరుకుంటే యుద్దాలు జరగాల్సి వస్తుంది. మరి దాని పీడ వదిలేది ఎలాగూ, వేరే దారేమైనా ఉందా!

మరింత సమాచారం తెలుసుకోండి: