ఏపీలో తెలుగుదేశం పార్టీ గత నాలుగైదు ఎన్నికల్లో ఒక్క సారి కూడా గెలవలేని నియోజకవర్గాలు చాలా ఉన్నాయి. చంద్రబాబు ఎప్పటికప్పుడు కృష్ణా - గుంటూరు - గోదావరిఉత్తరాంధ్ర జిల్లాలే తనను గెలిపిస్తే చాల‌న్న భావ‌న‌లో ఉంటూ వస్తున్నారు. చివరకు ఆయన సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో కూడా పలు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ దశాబ్దాలుగా విజయం సాధించడం లేదు. కనీసం ఈ నియోజకవర్గా ల పై దృష్టి పెట్టి అక్కడ బలమైన నాయకులను తయారు చేసుకోవాలన్న ఆలోచన కూడా చంద్రబాబుకు లేకుండా పోయింది.

రాయలసీమలోని కడప - కర్నూలు - చిత్తూరు జిల్లాల తోపాటు ప్రకాశం - నెల్లూరు జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉంది. ఈ ఐదు జిల్లాలోనే దాదాపు 30 కు పైగా నియోజ‌క‌వ‌ వర్గాల్లో టిడిపి వరుస ఎన్నికల్లో ఓడిపోతూ వస్తోంది. ఈ 30 నియోజ‌క‌ వర్గాల్లో ఇప్పటికీ బలమైన అభ్యర్థులు పార్టీకి లేరు. ఈ లిస్ట్ లోకి ప్ర‌కాశం జిల్లాలోని ఎర్ర‌గొండ‌పాలెం నియోజ‌క వ‌ర్గం కూడా వస్తుంది. ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెం నియోజకవర్గాల పునర్విభజనలో 2009లో ఏర్పడింది. ఆ తర్వాత జరిగిన మూడు ఎన్నికల్లోనూ ఇక్కడ పార్టీ ఓడిపోయింది.

2014 ఎన్నికల్లో అస‌లు నియోజకవర్గం లో చాలామందికి తెలియని బుడాల అజితా రావును చంద్రబాబు పోటీ చేయించారు. ఆమె ఓడిపోయింది. ఆ తర్వాత ఐదు సంవత్సరాల పాటు ఆమె అడ్రస్ లేకుండా పోయారు. తిరిగి గత 2019 ఎన్నికల్లో మరోసారి  ఆమె ను పోటీ చేయించారు. అజితా రావు మంత్రి ఆదిమూలపు సురేష్ చేతిలో ఓడిపోయారు. ఇక ఇప్పుడు గూడూరు ఎరిక్స‌న్ బాబు ను నియోజ‌క‌వ‌ర్గ‌ ఇన్చార్జిగా నియమించారు.

టిడిపి ఆవిర్భావం నుంచి పార్టీ కోసం పని చేస్తున్న ఆయన సర్పంచ్ - ఎంపీటీసీ - జడ్పిటిసి స్థాయి నుంచి ఎదుగుతూ వచ్చారు. ఆయన సొంత నియోజకవర్గం కనిగిరి. అయినా ఎరిక్స‌న్ బాబు అక్కడ పట్టు సాధించి మంత్రి సురేష్ కు చెక్ పెడతారోమో ? చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: