ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు కొడాలి నాని పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. నాని ఫైర్ బ్రాండ్ రాజకీయ నాయకుడిగా మారిపోయారు. కొడాలి నాని మీడియా సమావేశం వస్తుంది అంటే చాలు చంద్రబాబు ను , లోకేష్‌ను పిచ్చ బూతులు తిడ‌తాడ‌ర‌న్న‌ది ఆంధ్రప్రదేశ్ జనాలకు అర్థం అయిపోయింది. చంద్రబాబు పై 2014 ఎన్నికలకు ముందే వ్యక్తిగతంగా తీవ్రమైన విమర్శలు చేస్తూ వచ్చిన నాని... ఇప్పుడు జగన్ క్యాబినెట్లో మంత్రిగా కూడా ఉన్నారు. నందమూరి ఫ్యామిలీ నడిగడ్డ అయినా గుడివాడ ని త‌న అడ్డాగా మార్చుకున్న నాని ఇప్పుడు అక్కడ పసుపు జెండా మాయం చేసేసారు.

గత నాలుగు ఎన్నికల్లోనూ గుడివాడ నుంచి వరుసగా విజయాలు సాధిస్తూ వస్తున్న ఆయన గత రెండు ఎన్నికల్లోనూ వైసీపీ నుంచి భారీ మెజార్టీతో గెలుస్తూ వస్తున్నారు. గుడివాడ కమ్మ సామాజిక వర్గానికి కంచుకోట‌. అలాంటి చోట నాని చంద్రబాబు ని సవాల్ చేసి మరి బూతులు తిడుతున్నారు. అక్కడ కమ్మ సామాజిక వర్గం ఓట్లు 20,000 పైనే ఉన్నాయి. ఇక బీసీ - కాపు సామాజికవర్గ ఓటర్లు కూడా ఎక్కువే.

నాని తాజాగా చేస్తున్న వ్యాఖ్యలపై ... కమ్మ సామాజిక వర్గం లో ఆయన పట్ల వ్యతిరేకత తెచ్చేందుకు టిడిపి ప్రయత్నిస్తోంది. అయితే వాస్తవంగా గుడివాడ క‌మ్మ‌ల్లో నాని పై వ్యతిరేకత లేదు. అందరినీ కలుపుకొని పోతూ ఉంటారు. పైగా ఆయన కు బంధుత్వాలు ఎక్కువ. అందుకే ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గకుండా చంద్రబాబు , లోకేష్ పై మాటల తూటాలు పేలుస్తున్నారు.

గుడివాడ లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అందరూ కొడాలి నాని కి అభిమానులు ఉన్నారు. ఇక్కడ నాని అభిమానులు .. జూనియ‌ర్ అభిమానులు ఒకటే. అందుకే చంద్రబాబు ఇక్కడ కమ్మ సామాజిక వర్గాన్ని నానికి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నా నాని మాత్రం లైట్ తీసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: