చంద్రగిరి నియోజకవర్గం..పేరుకు టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టిన గడ్డ...కానీ ఈ నియోజకవర్గం పూర్తిగా వైసీపీకి కంచుకోట అని చెప్పొచ్చు. అసలు ఇక్కడ టీడీపీకి ఎక్కువ పట్టు లేదు. అందుకే ఇక్కడ టీడీపీ ఎక్కువసార్లు గెలిచిన దాఖలాలు లేవు. ఆఖరికి చంద్రబాబు సైతం నియోజకవర్గం వదిలిపెట్టారంటే పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. 1978లో చంద్రబాబు...కాంగ్రెస్ నుంచి గెలిచారు. కానీ 1983లో అదే కాంగ్రెస్ నుంచి పోటీ చేసి టీడీపీ చేతిలో ఓటమి పాలయ్యారు.

కానీ తర్వాత చంద్రబాబు టీడీపీలోకి వెళ్ళడం...1985లో పోటీకి దూరంగా ఉండటం..ఆ తర్వాత నుంచి కుప్పంలో అడుగుపెట్టి వరుస విజయాలు సాధిస్తున్న విషయం తెలిసిందే. ఇలా చంద్రబాబు...చంద్రగిరి వదిలి కుప్పం నియోజకవర్గానికి మారిపోయాక..చంద్రగిరిలో టీడీపీ మంచి విజయాలు అందుకోలేకపోయింది. ఏదో 1994లో ఒకసారి చంద్రబాబు సోదరుడు..రామ్మూర్తి నాయుడు గెలిచారు. ఇంకా అంతే మళ్ళీ ఎప్పుడు కూడా చంద్రగిరిలో టీడీపీ గెలవలేదు.

ఇక 1999, 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఓడిపోతూనే వస్తుంది. ఇలా వరుసగా ఓడిపోవడం వల్ల పార్టీకి సానుభూతి కూడా రావడం లేదు. ఎందుకంటే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న చెవిరెడ్డి భాస్కరరెడ్డి తిరుగులేని ప్రజా మద్ధతుతో ఉన్నారు. వరుసపెట్టి 2014, 2019 ఎన్నికల్లో గెలిచిన ఆయన...2024లో కూడా గెలవడం ఖాయమని తెలుస్తోంది. మరోసారి చెవిరెడ్డి విజయాన్ని అడ్డుకోవడం...టీడీపీకి కష్టమే అని తెలుస్తోంది. ఎందుకంటే ఆయన ప్రజల మనిషి...ఆయన్ని ఢీకొట్టడం టీడీపీకి సాధ్యమైన పని కాదు.

అందుకే అక్కడ ఇంచార్జ్‌గా ఉన్న పులివర్తి నాని సైతం...చంద్రగిరి వదిలిపెట్టి వెళ్లిపోవాలని చూస్తున్నారు. చంద్రగిరిలో మళ్ళీ పోటీ చేస్తే గెలవమని పులివర్తికి అర్ధమైనట్లు తెలుస్తోంది. అందుకే ఆయన చిత్తూరు అసెంబ్లీ స్థానానికి వెళ్లాలని చూస్తున్నారు. అక్కడే పోటీ చేయాలని చూస్తున్నారు. కానీ చంద్రబాబు ఆ అవకాశం ఇచ్చేలా లేరు. మళ్ళీ పులివర్తి...చంద్రగిరి బరిలో నిలబడటం ఖాయమే. కానీ విజయం ఎవరిని వరిస్తుందో కూడా చెప్పాల్సిన పని లేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: