తెలంగాణలో బీజేపీ రోజురోజుకు బ‌ల‌ప‌డుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఈట‌ల రాజేంద‌ర్ చేరిక హుజురాబాద్‌లో బీజేపీ త‌ర‌ఫున పోటీ చేసిన ఆయ‌న విజ‌యం కమ‌లం పార్టీలో కొత్త జోష్‌ను నింపింది. దీంతో ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌ను ప్రారంభించిన‌ట్టు తెలుస్తోంది. ఈట‌ల స‌పోర్ట్‌తో పాటు సీఎం కేసీఆర్ బీజేపీలో చేరేందుకు తెలంగాణ ఉద్య‌మ‌కారులు సిద్ధం అవుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఇందులో భాగంగానే తెలంగాణ ఉద్యోగుల సంఘం మాజీ అధ్య‌క్షుడు సి.హెచ్ విఠ‌ల్ నేడు కాషాయ తీర్థం పుచ్చుకోనున్నాడు. తెలంగా ఐక్య కార్య‌చ‌ర‌ణ (ఐకాస‌) ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా, కో-ఛైర్మెన్‌గా భాద్య‌త‌లు నిర్వ‌హించిన విఠ‌ల్ తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క‌పాత్ర పోషించారు.


 తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రం అవ‌త‌రించిన అనంత‌రం టీఎస్‌పీఎస్సీ స‌భ్యుడిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. త‌న ప‌ద‌వీ కాలం పూర్త‌యి సంవ‌త్స‌రం అవుతోంది. దీంతో ఇప్పుడు బీజేపీలో చేర‌నున్నాడు. ఆదివారమే ఢిల్లీకి చేరుకున్న విఠ‌ల్ జాతీయ నేత‌ల ఆధ్వ‌ర్యంలో బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నాడు. టీఎస్‌సీఎస్సీ స‌భ్యుడిగా ప‌ద‌వీ కాలం ముగిసిన త‌ర్వాత ఆయ‌నకు టీఎస్‌పీఎస్సీ చైర్మ‌న్ లేదా ఏదైనా కార్పొరేష‌న్ ప‌ద‌వి ద‌క్కే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చారం జ‌రిగినా అది నిజం కాలేదు. అలాగే, రాష్ట్రంలో నెల‌కొన్న నిరుద్యోగ స‌మ‌స్య‌పై ప్ర‌భుత్వాన్ని తీవ్రంగా వ్య‌తిరేస్తూ వ‌స్తున్నారు. ప్ర‌భుత్వం తీసుకున్న ప‌లు నిర్ణ‌యాన్ని త‌ప్పుబ‌ట్టారు.


 నిరుద్యోగ స‌మస్య  విష‌యమై చ‌ర్చించేందుకు ముఖ్య‌మంత్రి కేసీఆర్ అపాయింట్‌మెంట్ కోర‌గా నిరాక‌రించ‌డంతో విఠ‌ల్ తీవ్ర అసంతృప్తికి గుర‌యిన‌ట్టు స‌మాచారం. ఈ విష‌యాన్ని గ‌మ‌నిస్తున్న కాషాయ నేత‌లు ఆయ‌న‌తో సంప్ర‌దింపులు జ‌రిపి పార్టీలోకి ఆహ్వానం ప‌లికారు. దీనికి విఠ‌ల్ సుముఖ‌త చెప్పి నేడు కాషాయ కండువా క‌ప్పుకోనున్నారు. కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన సీ.హెచ్ విఠ‌ల్ చేరిక‌తో తెలంగాణ‌లో బీజేపీ మ‌రింత బల‌ప‌డుతుంద‌నే అవ‌కాశాలు ఉన్నాయ‌ని క‌మ‌లం పార్టీ నేత‌లు భావిస్తున్నారు. అయితే, విఠ‌ల్ బీజేపీలో చేర‌డం కేసీఆర్ ఎంతో కొంత ప్ర‌తికూల‌త ఏర్ప‌డుతుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: