మాట తప్పని మడమ తిప్పని ముఖ్యమంత్రిగా భారీ విజయాన్ని సాధించి సీఎం సీటు లోకి వచ్చారు  జగన్మోహన్ రెడ్డి. ఇక ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చుతు ముందుకు సాగుతున్నారు. కానీ జగన్ ఒక విషయాన్ని మాత్రం మర్చిపోయారా అంటూ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. అదే మంత్రివర్గ విస్తరణ. 151 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీ నుంచి గెలుపొందారు. ఈ క్రమంలోనే ఇక మంత్రివర్గాన్ని బాలన్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఇక రెండున్నర సంవత్సరాల పాటు ప్రస్తుతం ఎన్నికైన మంత్రివర్గం పని చేస్తుంది. ఇక ఆ తర్వాత కేవలం 10 శాతం మంత్రివర్గాన్ని మాత్రమే అలా ఉంచి మిగతా మంత్రి వర్గాన్ని కూడా మళ్లీ మార్చుదాం కొత్త వ్యక్తులకు అవకాశం కల్పిస్తాం అంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి తెలిపారు.



 అయితే జగన్ పాలన చేపట్టి రెండున్నర సంవత్సరాలు ముగిసింది. దీంతో ఎన్నో రోజుల నుంచి మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది అన్న వార్తలు వస్తున్నాయి. తప్ప అటు జగన్ ప్రభుత్వం మాత్రం దీనిపై స్పందించడం లేదు. అసలు సీఎం జగన్ అప్పట్లో చెప్పినట్లుగా మంత్రివర్గ విస్తరణ చేస్తారా లేకపోతే ఇదే మంత్రివర్గాన్ని కొనసాగిస్తారా అన్నది కూడా చర్చనీయాంశంగా మారిపోయింది. అయితే సంక్రాంతి తర్వాత కొత్త మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అని కొన్ని వార్తలు రాగ.. ఇక 2021 సంవత్సరం ముగిసే లోపే మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని మరోవైపు నుంచి వార్తలు వచ్చాయి.



 అయితే అప్పట్లో మంత్రివర్గ విస్తరణ కోసం జరుగుతుంది అంటూ టాక్ వినిపించగా ఇక ఇప్పుడు ఎలాంటి కసరత్తు జరగడం లేదు అని తెలుస్తోంది. దీంతో ఇక జగన్ చెప్పిన విధంగా మంత్రివర్గ విస్తరణ ఉందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారిపోయింది. మంత్రివర్గ విస్తరణ చేస్తే నేతల్లో అసంతృప్తి వస్తుందని జగన్ భయపడుతున్నారా.. లేదా మంత్రివర్గ విస్తరణ కోసం కసరత్తులు చేసేందుకు ముహూర్తం పెట్టుకున్నారా.. అసలు ఏం జరుగుతుంది అన్న దానిపై మాత్రం విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: