పాకిస్తాన్ పరిస్థితి రోజురోజుకు అధ్వానంగా మారిపోతుంది. పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో కూరుకుపోతోంది. ఇంత జరుగుతున్నా అటు పాకిస్థాన్ ప్రభుత్వం తీరులో మాత్రం ఎక్కడ మార్పు రావడం లేదు. ఇంకా ఉగ్రవాదాన్ని పోషిస్తున్న పాకిస్తాన్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం గురించి మాత్రం మరిచి పోయింది. ఇక రోజు రోజుకు ఆర్థిక సంక్షోభం పెరిగిపోతుండటంతో కనీసం ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితిలో కి వెళ్ళిపోతుంది పాకిస్తాన్ ప్రభుత్వం. ఈ క్రమంలోనే ప్రభుత్వ తీరుకు నిరసనగా పాకిస్తాన్ వ్యాప్తంగా ప్రజలందరూ తీవ్రస్థాయిలో నిరసనలు ఉద్యమాలు చేస్తున్నారు.



 అయితే పాకిస్థాన్లో పరిస్థితి ఇంత అధ్వానం గా మారుతున్నప్పటికీ అటు భారత్పై ఉగ్రవాదులను పంపించడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంది పాకిస్తాన్. అయితే పాకిస్తాన్లో పరిస్థితి రోజు రోజుకు ఎంతో అధ్వానం గా మారి పోయింది అనేదానికి రోజు రోజుకీ వెలుగు  లోకి వస్తున్న ఘటనలే నిదర్శనం గా మారి పోతున్నాయి అని చెప్పడం లో అతి శయోక్తి లేదు. ఇక ఇటీవలే మరో ఘటన కూడా వెలుగులోకి వచ్చింది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఎంత దివాలా తీసింది అన్నదానికి ఈ ఘటన నిదర్శనంగా మారిపోయింది అని చెప్పాలి.



 వివిధ దేశాల్లో ఉన్నటు వంటి పాకిస్థాన్కు చెందిన కాన్సులేట్ సిబ్బంది ఇతర ఆదాయ వనరుల ద్వారా జీతం పొందుతున్నారు. కానీ ఖాతార్ లో ఉన్నటువంటి కాన్సులేట్ సిబ్బందికి మాత్రం అలా ఆదాయం పొందేందుకు అవకాశం లేదు. ఈ క్రమం లోనే పాకిస్తాన్ జీతాలు చెల్లించకపోవడం  తో   తమకు జీతాలు చెల్లించాలి అంటూ ఖాతార్ ప్రభుత్వాన్ని కోరారు పాకిస్తాన్ సిబ్బంది. దీంతో పెద్ద మనసు చాటుకున్న ఖాతార్ ప్రభుత్వం పాకిస్థాన్కు చెందిన అధికారులకు జీతాలు చెల్లిస్తూ ఉండటం గమనార్హం. ఇలా పాకిస్తాన్ జీతాలు ఇచ్చు   కోలేని స్థితి లో దివాళా తీయడం మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: