దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించలేదు అని ఒక సామెత ఉంది.. ఇప్పుడు ఏపీ అర్చకుల విషయంలో ఇదే నిజం అవుతుంది అన్న టాక్ వినిపిస్తోంది.  అర్చకుల విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు రోజురోజుకీ హాట్ టాపిక్ గా మారిపోతుంది. అప్పట్లో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో 65a అనే ఒక జీవోను తీసుకువచ్చారు. అందరూ ఉద్యోగుల జీతాలు తీసుకుంటుంటే అర్చకులు మాత్రం సంభావనలు తీసుకోవడం ఏంటి.. మాకు కూడా జీతాలు వచ్చే విధంగా చూడండి అంటూ కోరడంతో 65ఏ జీవోను తీసుకువచ్చి ఇక అర్చకులకు జీతాలు అందించడం మొదలు పెట్టింది వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వం.




 ఇలా ఆలయం యొక్క ట్రెజరీ నుంచి జీతాలు తీసుకుంటూ ఉన్నారు అర్చకులు. ఇక అప్పట్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి తీసుకువచ్చిన ఈ జీవో ప్రస్తుతం తెలంగాణలో అమలవుతుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ రాజశేఖర్రెడ్డి తీసుకువచ్చిన జీవో అమలు చేస్తూ అర్చకులు అందరికీ కూడా ట్రెజరీ ద్వారా ప్రస్తుతం జీతాలు అందజేస్తున్నారు. ఒకానొక సమయంలో మధ్యలో గ్యాప్ వస్తే  ప్రభుత్వం రెండు వందల కోట్ల రూపాయలు కేటాయించి జీతాలు చెల్లించింది. కానీ అటు ఏపీలో మాత్రం ఇలాంటిది ఎక్కడా జరగడం లేదు.


 ఏకంగా తండ్రి వైయస్ తీసుకువచ్చిన జీవో నీ జగన్ ఏపీలో అమలు చేయకపోవడం మాత్రం హాట్ టాపిక్ గా మారిపోయింది. దీంతో జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తు నారు అర్చకులు. దేవాలయ నిధులను అధికారులు దుర్వినియోగం చేస్తున్నారు. కాని దేవాలయాల్లో పనిచేసే సిబ్బందికి అర్చకులకు నెలల తరబడి జీతాలు ఆగిపోయాయి. పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. తెలంగాణలో 65 ఏ జీవో ద్వారా అర్చకులు జీతాలు పొందుతున్నారు. కానీ ఏపీలో మాత్రం ఇది అమలు కావడం లేదు. మాకు న్యాయం చేయండి మహా ప్రబో అంటూ అర్చకులు జగన్ ప్రభుత్వాన్ని విన్నవించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: