వలస రాజకీయం అనేది దేశ వ్యాప్తంగా ఒక ట్రెండుగా మారుతోంది. ఒక పార్టీలో గెలిచి ఎమ్మెల్యే పదవి చేపట్టి మరో పార్టీలోకి మరి పెద్ద పదవులు వస్తాయని ఆశిస్తూ రాజకీయ నాయకులు వలసలు వెళుతుంటారు. అయితే తెరాస ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి    సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరించి వలస  రాజకీయాలకు శ్రీకారం చుట్టాడు. అటు కాంగ్రెస్ పార్టీ నుంచి టిఆర్ఎస్ కు పోయిన ఎన్నికల్లో 19 మంది కాంగ్రెస్ నుంచి గెలిస్తే ఇందులో చాలా మందిని టిఆర్ఎస్ ఆకర్షు ప్లాన్ లో భాగంగా కెసిఆర్ లాక్కున్నాడు. ప్రధానంగా ఇందులో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి మంత్రి పదవి ఇచ్చి, మిగతా వారికి కూడా ఏదో ఒక పదవి ఇస్తానని చెప్పి, తెలంగాణలో ప్రతిపక్షం అనేది లేకుండా చేయడంలో తెరాస ముందుంది అని చెప్పవచ్చు.

 ఏది ఏమైనా  ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజల చేత ఎన్నిక కాబడి, పదవులు వచ్చిన తర్వాత ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా పార్టీలు మారిన రాజకీయ నాయకులు ప్రజలకు ఏదైనా న్యాయం చేస్తున్నారా అనేది మనం ప్రధానంగా చూడాలి. ఒక పార్టీ గుర్తు మీద గెలిచి, మరో పార్టీలోకి జంప్ అయి వారికి తగిన ప్రాధాన్యత ఇస్తే వారికి ఓట్లేసిన ప్రజలను చాలామంది రాజకీయ నాయకులు విస్మరిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే వాళ్లు పార్టీలు మారేది వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసమే తప్ప, ప్రజల కోసం ఏమాత్రం కాదని ఒక విధంగా అర్థం చేసుకోవచ్చు. అయితే రాజకీయ నాయకుల పదవి వచ్చిన తర్వాత ఏది చేసినా తప్పు కాదు అనే భ్రమలో ఉంటారని దీన్ని బట్టి చూస్తే తెలుస్తుంది. సామాన్య ప్రజలు  ధరలు పెరిగాయని, రైతులకు మద్దతు ధర కావాలని, విద్యార్థుల స్కాలర్షిప్లు విడుదల చేయాలని  ధర్నాలు చేస్తే మాత్రం పోలీసులను పెట్టి మరి అరెస్టు చేయిస్తారు. చాలామందిపై దేశద్రోహ కేసులు కూడా పెడతారు. అంటే ప్రజల కోసం కొట్లాడే వారే రోడ్డు మీదికి వచ్చి ప్రశ్నిస్తే తప్పు.. ప్రజల ఓట్లు వెయించుకుని, వారి రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీలు మారితే అది తప్పు కాదు. అలాంటి దిక్కుమాలిన రాజకీయాలు మన భారత దేశ వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. ఎప్పుడు ఈ నాయకుల ఆలోచనలు పదవుల పైనే తప్ప , ప్రజలకు ఏదైనా మంచి చేయాలనే ఆలోచన అయితే ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీలో కనిపించడం లేదని ప్రజలు అనుకుంటున్నారు. ఏది ఏమైనా ఈ వలస రాజకీయాలకు, లాక్‌డౌన్‌ పడేది  ఎన్నడో అనేది ముందు ముందు తెలుస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: