ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల బలం లేకపోయినా సరే అన్ని విధాలుగా కూడా పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్ని విధాలుగా కూడా ప్రయత్నం చేస్తూ పార్టీని ఏకతాటిపై నడిపించేందుకు కాస్త ఎక్కువగా కష్టపడుతున్నారు. అమరావతి ఉద్యమానికి భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం మద్దతు ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర నాయకత్వం కూడా మద్దతిచ్చే పాద యాత్రలో పాల్గొనడంతో బిజెపి నేతలు మీడియా లో ఉంటున్నారు. రాజకీయంగా పార్టీకి అమరావతి ఉద్యమానికి ఎంత వరకు కలిసి వస్తుంది ఏంటి అనేది తెలియక పోయినా చంద్రబాబు నాయుడు అమరావతి ఉద్యమాన్ని ముందుండి నడిపించడంలో భారతీయ జనతా పార్టీ ఆ క్రెడిట్ కోసం అన్ని విధాలుగా కూడా ప్రయత్నం చేస్తోంది.

బిజెపి లో ఉన్న రాష్ట్ర నాయకులు కొంతమంది ఇటీవలి కాలంలో నియోజకవర్గాల పర్యటనకు వెళ్లడం అలాగే తెలుగుదేశం పార్టీలో ఉన్న కొంతమంది రెడ్డి సామాజిక వర్గం నాయకులను తమ పార్టీలోకి తీసుకునే ప్రయత్నం చేయడం అలాగే జనసేన పార్టీ ద్వారా కాపు సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకోవాలని భావించడం దళిత ఓటు బ్యాంకు మీద కూడా కొన్ని కొన్ని విషయాల్లో దృష్టిపెట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడటం ద్వారా లబ్ధి పొందే ప్రయత్నం చేయడం వంటివి కాస్త ఎక్కువగా జరుగుతున్నాయి.

బిజెపి లో ఉన్న చాలామంది నాయకులు ఈ మధ్యకాలంలో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేయడంతో పాటు అధికార పార్టీ వ్యవహారాల మీద ఎక్కువగా దృష్టి సారించి మైనింగ్ అలాగే ఇసుక అక్రమాలు మీద ఎక్కువ ఫోకస్ చేశారు అని అంటున్నారు. చాలా వరకు కూడా పార్టీ కార్యకర్తలను ముందుండి నడిపించే దానికి నియోజకవర్గాల్లో సమర్థవంతమైన నాయకత్వం కోసం భారతీయ జనతా పార్టీ భావిస్తోందని ఆ పార్టీ నాయకులు స్వయంగా వ్యాఖ్యానిస్తున్నారు.మరి ఏపీ  బిజెపి ఇంకెంత స్పీడ్ గా ముందు ముందు  వెళ్తుందో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp