తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని పూర్తిస్థాయిలో బతికించేందుకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నా సరే ఆ పార్టీ నేతల నుంచి సహకారం లేకపోవడం తో కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం కూడా సమర్థవంతంగా ముందుకు వెళ్లలేక పోతుంది. పార్టీలో ఉన్న చాలామంది నాయకులు ఇతర పార్టీల నాయకులతో స్నేహం చేయడం ప్రధానంగా భారతీయ జనతా పార్టీ లోకి వెళ్లాలని ప్రయత్నం చేయడం అదే విధంగా సీఎం కేసీఆర్ కు కాస్త ఎక్కువగా భయపడటం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని బాగా ఇబ్బంది పెడుతున్న అంశంగా చెప్పాలి.

చాలా మంది కాంగ్రెస్ నాయకులు ఈ మధ్యకాలంలో పార్టీ వ్యవహారాల మీద దాదాపుగా పట్టుకోలేకపోయారు అనే విషయం క్లియర్ గా అర్ధం అవుతుంది. రాజకీయంగా భారతీయ జనతా పార్టీ చాలా వేగంగా బలపడటం క్యాడర్ లేకపోయినా సరే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ క్యాలెండర్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తూ అన్ని నియోజకవర్గాల మీద ఎక్కువగా దృష్టి పెట్టడం వంటివి ఈ మధ్యకాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. పార్టీ లో చాలా మంది నాయకులకు ఆయన ఇప్పటికీ పూర్తిస్థాయిలో క్లారిటీ ఇవ్వడమే కాకుండా కొంత మందిని పార్టీలోకి తీసుకొచ్చేందుకు అన్ని విధాలుగా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు.

చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులను రేవంత్ రెడ్డి ముందుకు నడిపించే విషయంలో గానీ పార్టీ కార్యకర్తలకు అదేవిధంగా అభిమానులకు పార్టీ భవిష్యత్తు మీద నమ్మకం కల్పించే విషయంలో ఘోరంగా విఫలమయ్యారని క్లియర్గా అర్థమవుతుంది. అయితే హుజురాబాద్ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి గ్రాఫ్ దాదాపుగా పడిపోయిందని సొంత జిల్లా మహబూబ్ నగర్ లో కూడా ఆయనకు పెద్దగా ఇమేజ్ లేదని భారతీయ జనతా పార్టీ గురించి మాత్రమే ఇప్పుడు తెలంగాణలో మాట్లాడుకుంటున్నారని రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీని బతికించిన లేరనే విషయం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అర్థమైంది అనేది పలువురు చేస్తున్న వ్యాఖ్యలు.

మరింత సమాచారం తెలుసుకోండి: