ఇటీవలి కాలంలో వలస రాజకీయాలు ఎంతలా పెరిగిపోయాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక పార్టీలో కలిసి రానప్పుడు నిర్మొహమాటంగా వేరే పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. ఇక వేరే పార్టీలోకి వెళ్లిన తర్వాత లబ్ధి పొందిన వారు కొంతమంది అయితే.. వేరే పార్టీ లోకి వెళ్లి రాజకీయంగా వెనుకబడిన వారు మరికొంతమంది. అయితే ఇలా వలస రాజకీయం బాగా కలిసి వచ్చిన రాజకీయ నాయకులలో చెప్పుకోదగ్గ పేర్లలో రేవంత్ రెడ్డి ముందు స్థానంలో ఉంటారూ.



 అయితే దూకుడైన రాజకీయాలకు రేవంత్ రెడ్డి కేరాఫ్ అడ్రస్ అన్న విషయం తెలిసిందే. తక్కువ సమయంలో జనాదరణ పొందిన లీడర్గా ఎదిగాడు రేవంత్ రెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రియ శిష్యుడిగా గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో టిడిపి మనుగడ ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారిపోయింది. అయితే రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే పదవి లో ఉన్నప్పటికీ అధికార పార్టీని ఎదుర్కొనేందుకు సరైన బలం మాత్రం లేకుండా పోయింది. ఈ క్రమంలోనే వలస రాజకీయం వైపు నడిచారు రేవంత్ రెడ్డి.



 టిడిపి పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరడం రేవంత్ రెడ్డి కి ఎంతగానో కలిసి వచ్చింది అని చెప్పాలి. అప్పుడు వరకు టిడిపి కీలక నేతగా ఉన్నప్పటికీ అధ్యక్ష పదవి మాత్రం దక్కించుకోలేక పోయాడు.కానీ కాంగ్రెస్లోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే సీనియర్లను సైతం వెనక్కి నెట్టి అధ్యక్ష పదవిని దక్కించుకున్నాడు. కాంగ్రెస్ అధిష్టానాన్ని సైతం మెప్పించి రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టడం గమనార్హం ఇలా ఒక రకంగా వలస రాజకీయం రేవంత్ రెడ్డికి ఎంతగానో కలిసివచ్చింది. అధికార పక్షాన్ని ప్రశ్నించేందుకు ఒక బలమైన పార్టీ దొరకడమే కాదు ఆ పార్టీని తనదైన శైలిలో ముందుకు నడిపించే అవకాశం కూడా వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: