సాధారణంగా వలసలు పోవడం గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. ఒక ప్రాంతంలో ఉపాధి  దొరకనప్పుడు ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లడం లాంటివి చేస్తూ ఉంటారూ. ఇక వేరే ప్రాంతానికి వెళ్లి అక్కడ దొరికిన పని చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటారు. అప్పుడు వలసలు బతుకుదెరువుకోసం ఉండేది. కానీ ఇప్పుడు అదే వలసలు ఏకంగా రాజకీయాల్లోకి కూడా వచ్చేసాయి. అబ్బో రాజకీయాల్లో వలస చూస్తే మాత్రం మామూలుగా లేవు అని చెప్పాలి. ప్రజల కోసమే పార్టీ మారుతున్నాము.. ప్రజల తరఫున పోరాటానికి ఇలా చేస్తున్నాము.. ప్రజా నిర్ణయాన్ని ఎంతగానో గౌరవిస్తాం అంటూ చెబుతూ ఉంటారు నాయకులు.



 కానీ ఒక పార్టీలో పదవి రాకపోతే ఏకంగా ప్రజా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇతర లోకి వెళ్లి మరి పదవులు పొందడం లాంటివి చేస్తూ ఉన్నారు నేటి రోజుల్లో. అంతే కాదు ఏ పార్టీ అధికారంలోకి వుంటే ఆ పార్టీలోకి వలసలు వెళ్లడం ఈ మధ్యకాలంలో సర్వసాధారణంగా మారిపోయింది. అప్పుడు ఇలా పార్టీ మారిన వారి విషయంలో ప్రజలు కూడా ఎంతో కఠినంగానే ఉండేవారు. ఇక ఇటీవల కాలంలో ప్రజలు సైతం పార్టీ మారుతు వలసలు పోతున్న వారిని లైట్ తీసుకుంటున్నారు.



 ఇలా నేటి రోజుల్లో ఎక్కడ చూసినా వలస రాజకీయాలు పెరిగి పోయాయి అని చెప్పాలి. పదవి కోసం ఒకరు.. డబ్బు కోసం ఒకరు.. రాజకీయ మనుగడ కోసం ఇంకొకరు.. ఆత్మ గౌరవం అంటూ మరొకరు  ఇక అందరూ చెప్పే మాటలు వేరుగా ఉన్న చేసేది మాత్రం వలస రాజకీయమే అని అంటున్నారు విశ్లేషకులు. రోజు రోజుకి రాజకీయాల్లో వలసలు పెరిగిపోయి.. రాజకీయం అనే పదానికి అర్థాన్ని మార్చేస్తున్నాయి అని చెప్పాలి. ఇక ఇతర పార్టీలోకి వలసలు వెళ్తే రాజకీయంగా మరింత లబ్ధి చేకూరుతు ఉండడంతో తప్పు అని తెలిసినా తప్పక రాజకీయ నాయకులు ఇతర పార్టీల్లోకి వెళ్లాల్సిన స్థితి ఏర్పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: