జయలలిత ఈ పేరే ఒక ప్రభంజనం. దివంగత మాజీ ముఖ్యమంత్రి , నటి అయిన జయలిత గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆమె ప్రేమ సంద్రం, ఆమె కోపం సునామీ, ఆమె జాలి అనంతం. సినీ రంగం లోకి అడుగుపెట్టి అక్కడ ఎనలేని ప్రేక్షక అభిమానాన్ని కూడగట్టుకుని అనంతరం రాజకీయ రంగప్రవేశం చేసి ప్రజా పాలన అంటే ఎలా ఉండాలో కొత్త అర్దం చెప్పిన మహా నాయకురాలు. మదర్ తెరిస్సాకే అధికారం వస్తే ఎలా అయితే ప్రజా సేవలో మునిగితేలుతారో అన్న ఆలోచనకు నిదర్శనం. అంతగా ఓ గొప్ప నాయకురిలాగా ప్రతిష్టాత్మక పాలన చేపట్టి జనాల ప్రేమను పొందిన గొప్ప రాజకీయవేత్త. ఇపుడు జయలలిత గారి గురించి కొన్ని ఆసక్తికర విషయాలను చూద్దాం.

దివంగత ముఖ్యమంత్రి జయలలిత గారు అవివాహిత గానే తన జీవిత ప్రయాణాన్ని గడిపారు. అయితే ఈమెకు దత్తత పుత్రుడు ఉన్నాడన్న విషయం తెలిసిందే. ఆయన పెళ్లిని 1996 లో అంగరంగ వైభవంగా ఒక రాజకుమారుడు వివాహం అంత వైభవంగా చేయడంతో అందరి దృష్టి ఆమె ఆస్తిపాస్తులపై పడింది. ఆ తరవాత కొద్ది రోజులకు అధికారులు చేసిన సోదాల్లో బయటపడ్డ ఆమె సంపదను చూసి అంతా అవాక్ అయిపోయారు. అనంతరం ఆమె అక్రమాస్తుల కేసుపై జైలు శిక్ష కూడా అనుభవించారు. జైలు నుండి రిలీజ్ అయిన తరవాత ఆమె జీవన శైలిలో పెను మార్పు చోటు చేసుకుంది.

అప్పటి వరకు మహారాణిలా బ్రతికిన ఆమె జైలు శిక్ష తరవాత చాలా సాదాసీదాగా జీవించారు. కేవలం రెండు రంగుల సాధారణమైన చీరల్లోనే ఆమె కనిపించేవారు. నగలు ఏమాత్రం పెట్టుకునే వారు కాదు. కానీ ఆమె  వేద నిలయంలో మాత్రం కేజీల కొద్ది బంగారం, వెండి, వందల కొద్దీ చొప్పుల జతలు ఒకటి కాదు అన్ని రకాల లగ్జరీ ఫర్నిచర్ ఇలా రాజభవనాలకు మించి ఆడంబరంగా ఉంది. ఇలా ఆమె జీవితంలో ఎన్నో అద్భుతాలు చోటుచేసుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: