సాధారణంగా మంత్రులుగా పనిచేసే నేతలపై కాస్త వ్యతిరేకత వస్తుందనే విషయం తెలిసిందే. బాగా గొప్పగా పనిచేసిన మంత్రులని పక్కనబెడితే...ఏదో పేరుకే మంత్రులుగా ఉన్న మంత్రులకు చిక్కులు తప్పవు. అలాంటి మంత్రులని ప్రజలు ఓడించడం గ్యారెంటీ. అయితే కొందరు మంత్రులుగా బాగా పనిచేయకపోయినా సరే..వారి వారి నియోజకవర్గాల పరిధి మేరకు బలంగా ఉంటారు...బాగా పనిచేస్తారు..అలాంటి వారికి చెక్ పెట్టడం చాలా కష్టం.

అయితే ఏపీలో ఉన్న మంత్రులకు చెక్ పెట్టాలని చంద్రబాబు గట్టిగానే ట్రై చేస్తున్నారు. ఎందుకంటే మంత్రులు ఏ విధంగా బాబుని టార్గెట్ చేసి రాజకీయం చేస్తున్నారో అందరికీ తెలిసిందే. ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగిస్తున్నారు. అసలు ఒకో మంత్రి, బాబుపై ఓ రేంజ్‌లో ఫైర్ అయిపోతున్నారు. అలా తనని టార్గెట్ చేసిన మంత్రులకు ఎలాగైనా చెక్ పెట్టాలనే ఉద్దేశంతో బాబు ఉన్నారు.

కానీ అందరికీ చెక్ పెట్టడం చంద్రబాబుకు సాధ్యమయ్యే పనిలా లేదు. కొందరు మంత్రులని ఓడించడం జరిగే పని కాదని చెప్పొచ్చు. కొందరు మంత్రుల పనితీరు పరంగా కాకపోయినా...వారి వారి నియోజకవర్గాల పరంగా మాత్రం చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నారు. అలా స్ట్రాంగ్‌గా ఉన్నవారిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముందు వరుసలో ఉన్నారు. పుంగనూరులో ఈయనకు చెక్ పెట్టడం జరిగే పని కాదు...మళ్ళీ ఈయన గెలుపుని అడ్డుకోవడం బాబు వల్ల కాదు.

ఇక బాబు అంటే ఒంటికాలి మీద లేచే కొడాలి నానికి సైతం చెక్ పెట్టడం అంత సులువు కాదు. గుడివాడలో కొడాలి నానిని ఓడించడం జరిగే పని కాదు. పైగా ఇక్కడ టీడీపీ చాలా వీక్‌గా ఉంది. అలాగే ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆత్మకూరులో మేకపాటి గౌతమ్ రెడ్డి, యర్రగొండపాలెంలో సురేష్, డోన్‌లో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కడపలో అంజాద్ బాషాలని ఓడించడం బాబుకు సాధ్యం కాదనే చెప్పాలి. నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ ఈ మంత్రుల గెలుపు సులువే అని చెప్పొచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి: