తెలంగాణలో బీజేపీ పుంజుకుంటున్న విషయం తెలిసిందే. మామూలుగా తెలంగాణలో బీజేపీకి పెద్దగా బలం లేదు. గతంలో ఎప్పుడైనా బీజేపీ తెలంగాణలో నాలుగైదు సీట్లు గెలుచుకునేది అంటే...అది టీడీపీతో పొత్తు వల్లే. కానీ సింగిల్‌గా మాత్రం పెద్దగా సత్తా చాటలేకపోయింది. గత ఎన్నికల్లో కూడా కేవలం ఒక సీటు మాత్రమే బీజేపీ గెలుచుకుంది. అలా ఒక సీటు గెలుచుకున్న బీజేపీ ఇప్పుడు అధికార టీఆర్ఎస్‌కు పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగింది.

దీనికి ప్రధాన కారణం...కేసీఆర్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆయన..తమకు ప్రత్యామ్నాయం లేకుండా చేయాలని టీడీపీ, కాంగ్రెస్‌లని తోక్కేశారు. ఇక ఆ గ్యాప్‌లో బీజేపీ పికప్ అయిపోయింది. పైగా కేంద్రంలో అధికారంలో ఉండటం...తెలంగాణ బీజేపీ అధ్యక్షుడుగా బండి సంజయ్ వచ్చాక రాజకీయం పూర్తిగా మారింది. గత అధ్యక్షులు కంటే భిన్నంగా బండి దూకుడుగా రాజకీయం చేయడం మొదలుపెట్టారు. కేసీఆర్ ప్రభుత్వంపై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతూ వచ్చారు. అలాగే ఇతర పార్టీల్లో ఉన్న బలమైన నాయకులని తమ వైపు తిప్పుకోవడంలో బండి సంజయ్ సక్సెస్ అయ్యారు.

ఊహించని విధంగా దుబ్బాక ఉపఎన్నిక, జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు చుక్కలు చూపించారు. ఇక్కడ నుంచే రాజకీయం మొత్తం మారింది...టీఆర్ఎస్‌కు బీజేపీ ప్రత్యామ్నాయం అనే పరిస్తితి వచ్చింది. మధ్యలో పి‌సి‌సి అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి వచ్చాక...కాస్త కాంగ్రెస్ రేసులోకి వచ్చింది. ఈలోపు ఈటల రాజేందర్ లాంటి నాయకుడుని బీజేపీలో చేర్చుకుని, హుజూరాబాద్‌లో గెలవడంతో మళ్ళీ పరిస్తితి మారింది.

కేసీఆర్‌తో ఢీ అంటే ఢీ అనే పరిస్తితి వచ్చింది. అయితే ఇపుడున్న బలం కేసీఆర్‌ని ఢీకొట్టడానికి సరిపోదనే చెప్పాలి. ఇంకా బీజేపీ పికప్ అవ్వాలి. అసలు క్షేత్ర స్థాయిలో బీజేపీకి బలమైన నాయకత్వం గానీ, బలమైన క్యాడర్ గానీ లేదు. ఇదే బీజేపీకి పెద్ద మైనస్. చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్తితి ఉంది. అసలు చెప్పాలంటే టీఆర్ఎస్, కాంగ్రెస్‌ల కంటే బలమైన క్యాడర్ బీజేపీకి లేదు. కాబట్టి బలమైన క్యాడర్‌ని, బలమైన నాయకత్వాన్ని ప్రతి నియోజకవర్గంలో ఉండేలా చూసుకోవాలి...అప్పుడే బీజేపీ, టీఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇవ్వగలదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp