ప్ర‌జల్లో వ్య‌తిరేక‌త రాక మునుపే మేల్కోవాలి

లేదంటే కొన్ని రాజ‌కీయ శ‌క్తులు వాటిని

త‌మ‌కు అనుగుణంగా మార్చుకుంటాయి


ఇప్పుడిదే సూత్రాన్ని పాటిస్తున్నారు వైసీపీ నాయ‌కులు

మాట తూలిన పాపానికి దిద్దుబాటులో ఉన్నారు

కాస్త త‌గ్గి భువ‌నేశ్వ‌రి కాళ్లు ప‌ట్టుకుంటాం అని అంటున్నారు

ప్రాథేయ‌ప‌డుతున్నారు.




మంత్రి బొత్స కానీ లేదా ఇంకొక‌రు కానీ ఇంకా ఇంకొంద‌రు రాజ‌ధానికి సంబంధించి ఎప్పుడూ ఏదో ఒక వివాదం రేపుతూనే ఉన్నారు. ఇవి ఎలా ఉన్నా కూడా పాల‌క  వ‌ర్గంలో ఉంటూ అనుచిత వ్యాఖ్య‌ల‌కు మూలం అయిన రాజ‌కీయ నాయకులు కొంద‌రు వైసీపీకి ప‌రువు న‌ష్టం చేస్తున్నారు. ఇవి ఇలాఉండ‌గానే మ‌హిళ‌ల‌ను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్య‌లు చేసి వైసీపీ నాయ‌కులు అడ్డంగా దొరికిపోయిన ఘ‌ట‌న‌పై రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ న‌డుస్తోంది. అవ‌సరం అనుకుంటే తాము భువ‌నేశ్వ‌రి కాళ్లు ప‌ట్టుకుంటూ క్ష‌మాప‌ణ‌లు కోరుతామ‌ని చెప్పడం వెనుక సిస‌లు రాజ‌కీయం దాగి ఉంది. ఏదేమ‌యిన‌ప్ప‌టికీ వైసీపీ స్పీడు త‌గ్గింది. దూకుడు త‌గ్గింది. సీఎం కూడా ఆర్థిక సంక్షోభాల‌ను క్లియ‌ర్ చేయ‌లేక కొంత, అసెంబ్లీ సంక్షోభం నిలువ‌రించ‌లేక కొంత, ప్ర‌కృతి విప‌త్తుల‌తో కొంత స‌త‌మ‌తం అవుతున్నారు.





అధికారం ఉంద‌న్న పొగురు కార‌ణంగా కొంత, గ‌ర్వం కార‌ణంగా కొంత ఆ రోజు అసెంబ్లీలో టీడీపీ ఎన్నో త‌ప్పులు చేసింది. విప‌క్ష నేత చిన్న‌వాడు అని జ‌గ‌న్ ను ఉద్దేశించి చంద్ర‌బాబు కూడా చాలా మాట‌లు అన్నారు. అనిపించారు. ఫ‌లితంగా జ‌గ‌న్ కు రాజ్యాధికారం ద‌క్కింది. స్పీక‌ర్ కోడెల చేసిన త‌ప్పులు కొన్ని, చంద్ర‌బాబు చేసిన త‌ప్పులు కొన్ని క‌లిసి ఆ రోజు టీడీపీని న‌ట్టెట ముంచాయి. ముఖ్యంగా రాజ‌ధాని రాజ‌కీయంలో చంద్ర‌బాబు చాలా చాలా వేగంగా ప‌రిణామాల్లో మార్పులు తెచ్చినా ఫ‌లితం లేకుండా పోయింది. రాజ‌ధానికి చంద్ర‌బాబు చేసిందేం లేదు అని అమ‌రావ‌తిలో ఆయ‌న క‌ట్టిందేం లేద‌ని తేల్చేశారు మంత్రి బొత్స. ఇవన్నీ న‌డుస్తుండ‌గా రాజ‌ధాని రైతుల స‌మ‌స్య ఎప్ప‌టి నుంచో అప‌రిష్కృతంగానే ఉంది.





వాళ్ల‌ను పిలిపించి మాట్లాడే ధైర్యం సీఎం ఎందుకు చేయ‌లేక‌పోతున్నార‌న్న సందేహాలు కూడా  వ్య‌క్తం అవుతున్నాయి. ఇదంతా రాజకీయంలో భాగ‌మే క‌దా అన్న అనుమానాలూ వ్య‌క్తం అవుతున్నాయి. భూములు త‌న్నుకు పోయేందుకు మాత్రమే విశాఖ కేంద్రంగా రాజధాని నాట‌కం న‌డుపుతున్నార‌న్న‌ది సీపీఎం నిన్న‌టి వేళ చేసిన ఆరోప‌ణ. ఇవి ఎలా ఉన్నా ఇదివ‌ర‌కు దూకుడు ఇప్పుడు వైసీపీకి మంచిది కాదు. దిద్దుకోలేని త‌ప్పులు, అనుచిత వ్యాఖ్య‌లు చేసిన వైసీపీ కొన్నాళ్లు సైలెంట్ అయిపోతేనే బెట‌ర్. ముఖ్యంగా ఆ ఇద్ద‌రితోనే డేంజ‌ర్ క‌నుక కొడాలి నాని మ‌రియు వ‌ల్ల‌భ‌నేని వంశీ కూడా మాట్లాడ‌కుండా ఉంటే ఇంకా బెట‌ర్.

మరింత సమాచారం తెలుసుకోండి: