క‌ష్ట‌ప‌డి సాధించుకున్న అధికారానికి ఇవాళ విలువే లేకుండా పోతోంది. ఆయ‌న క‌ష్టం నుంచి పుట్టిన పార్టీ కి ఆయ‌న క‌ల‌ల నుంచి పుట్టిన పార్టీకి కొంద‌రు అప్ర‌తిష్ట తెస్తున్నారు. అయినా కూడా జ‌గ‌న్ హెల్ప్ లెస్ . ఆ ఇద్ద‌రినీ నియంత్రించ‌కపోతే జ‌గ‌న్ కు క‌ష్ట కాలం రానే రానుంది త్వ‌ర‌లో! ఆ ఇద్ద‌రూ ఎవ‌రంటే ఒక‌రు వల్ల‌భ‌నేని వంశీ, మ‌రొక‌రు కొడాలి నాని.



క‌థంటే మామూలు క‌థ కాదు. ఎవ‌రు విన‌ని క‌థ. అస‌లు రాయ‌డానికి వీల్లేని భాష‌లో రాసిన క‌థ. అసెంబ్లీ వేదిక‌గా వినిపించిన క‌థ. త‌రువాత కూడా కొన‌సాగించిన క‌థ. ఇన్ని ఆరోప‌ణ‌లు ఒక మ‌హిళ‌ను ఉద్దేశించి  చేసిన వ్యాఖ్య‌లు వీట‌న్నింటి ఫ‌లితం రేప‌టి ఎన్నిక‌ల‌పై త‌ప్ప‌క ఉంటుంది. అయిన‌ప్ప‌టికీ వైసీపీ ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. త‌న ప‌ని తాను చేసుకుని పోతోంది. అయిన‌ప్ప‌టికీ టీడీపీ కూడా త‌గ్గ‌డం లేదు. వైసీపీలానే టీడీపీ కూడా కొంత సెంటిమెంట్ రాజ‌కీయాల‌ను నిర్వ‌హిస్తోంది. సెంటిమెంట్ కార‌ణంగానే జ‌గ‌న్ ఆ రోజు మంచి విజ‌యం సాధించార‌ని తామెందుకు ఆ విధంగా చేయ‌కూడ‌దు అన్న వాద‌న‌లో టీడీపీ కూడా ఉంది.



ఇక భువ‌నేశ్వ‌రి కాళ్లు క‌డుగుతాం మా క‌న్నీళ్ల‌తో అని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్ రెడ్డి చెప్పిన మాట‌లు, చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ వ‌ర్గాలులో పెను సంచ‌ల‌నం రేపుతున్నాయి. అధినేత‌ను సైతం విస్మ‌య ప‌రుస్తున్నాయి. అయితే వ‌ల్ల‌భ‌నేని వంశీ చేయాల్సిన వ్యాఖ్య‌లు అవి కావు అని అంటూనే, టీడీపీకి కూడా కొంత బుద్ధి చెప్పే ప‌నిలో వైసీపీ లీడ‌ర్లు ఉన్నారు. 




ఈ క‌థ‌లో విల‌న్ ఎవ‌రో ఇప్ప‌టి వ‌ర‌కూ తేల‌డం లేదు. టీడీపీ నుంచి అనూహ్యంగా బ‌య‌ట‌కు వ‌చ్చి  వైసీపీ లో ఉంటూ (అధికారికంగా కాక‌పోయినా ఆ పార్టీ మ‌ద్ద‌తు దారుగా) గోతులు త‌వ్వుతున్న వ‌ల్ల‌భ‌నేని వంశీ మోహ‌న్ అనేక ఆరోప‌ణ‌ల‌కు కార‌ణం అవుతున్నారు.. అని అంటోంది టీడీపీ. త‌మ పార్టీలో ఉన్న నేత‌లకూ, వంశీకీ ఎటువంటి సంబంధాలూ లేవ‌నే అంటోంది. ఇక కొడాలి నాని కూడా బూతులు తిట్ట‌డం త‌గ్గించుకుంటే ఈ క‌థ‌లో విల‌న్ ఎవ‌ర‌న్న‌ది తేలిపోతుంది. అంబ‌టి రాంబాబు, రోజా కూడా మీడియా ముందుకు రావ‌డ‌మే మానుకుంటే బెట‌ర్.

మరింత సమాచారం తెలుసుకోండి: