ఎవ‌రో ఒక‌రి నియంత్ర‌ణ ఉండాలి రాజకీయం అన్నాక.. ఎక్క‌డో ఓ చోట మాట నిల‌బెట్టుకునే నైజం ఒక‌టి ఉండాలి రాజ‌కీయం అన్నాక.. ఇష్టం వ‌చ్చిన రీతిలో మాట్లాడ‌డం..ఇష్టం వ‌చ్చిన రీతిలో దూష‌ణ‌లు చేయ‌డం స‌బ‌బు కాదు. వ‌ల్ల‌భ‌నేని వంశీ కానీ కొడాలి నాని కానీ వ్యూహాత్మ‌కంగానే వైసీపీ ప‌రువు తీస్తున్నారు. ఇది జ‌గ‌న్ గ్ర‌హించ‌లేక‌పోతున్నారు. అందుకనో ఎందుకనో జ‌గ‌న్ వెనుక‌బ‌డిపోతున్నారు. పాద‌యాత్ర‌తో తెచ్చుకున్న మైలేజీ అంతా ఎప్పుడో పోయింది. దీంతో జ‌నంలో జ‌గ‌న్ పై కుల ముద్ర, చుల‌క‌న భావం బాగానే పెరిగిపోతోంది.




రెండు జాతీయ పార్టీలో కాంగ్రెస్ త‌ప్ప బీజేపీ ఎప్పుడూ అధికారంలోకి రాలేదు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న‌ప్పుడు ఓ ప‌దేళ్ల స‌మ‌యం ప‌రిగ‌ణిస్తే 2004 నుంచి 2014 వ‌ర‌కూ పరిణామాలు మారాయేమో కానీ ఇంత‌గా దిగ‌జారుడు రాజ‌కీయం న‌డ‌వ‌లేదు. సంక్షేమ ప‌థ‌కాలు ఇచ్చారే కానీ ఆ పేరిట డ‌బ్బులు పంచ‌లేదు. ఇక ఉన్నంత‌లో వైఎస్సార్, చంద్ర‌బాబు మ‌ధ్య యుద్ధం న‌డిచిందే కానీ మ‌రీ ఇంత అనైతికం కాదు. ఎంత కాద‌న్నా కొన్ని సంద‌ర్భాల్లో అయినా విప‌క్షం మాట్లాడేందుకు వారి మాట వినేందుకు వైఎస్ ఎన్న‌డూ సిద్ధంగానే ఉన్నారు. అస‌లు రోశ‌య్య కానీ వైఎస్ కానీ మ‌రీ ఇంత‌గా ఏనాడూ ఎవ్వ‌రినీ నియంత్రించిందీ లేదు. మాట‌ల దాడి చేసిందీ లేదు.




ఇంత అస‌హ్యంగా రాజ‌కీయం ఉంటుంద‌ని ఎవ్వ‌రూ ఊహించ‌రు. ఊహించాక ఇటుగా ఎవ్వ‌రూ రారు. వ‌చ్చాక మ‌రీ ఇంత దిగ‌జా రుడు మ‌నుషుల‌ను చూసి అస‌హ్యించుకుని మ‌ళ్లీ త‌మ‌దారి తాము చూసుకోకుండా వెళ్ల‌లేరుజ‌. అవును! ఇప్పుడు జ‌రిగిందిదే! ఒక‌ప్పుడు ఇంత‌గా తిట్టుకున్నారా..లేదా ఒక‌రిపై ఒక‌రు చెప్పులు వేయించుకున్నారా అన్న‌ది అటుంచితే అప్ప‌టి క‌న్నాఇప్పుడు మ‌రింత హీనంగా రాజకీయాలు ఉన్నాయ‌న్న‌ది నిజం. వంశీ వ్యాఖ్య‌లు త‌రువాత ప‌రిణామాలు ఏపీలో ఏం చెప్పాలో తెలియ‌ని తిక‌మ‌క ఒక‌టి కొన‌సాగుతోంది. ఆఖ‌రికి భువ‌నేశ్వ‌రి కాళ్లు ప‌ట్టుకుని బ‌తిమ‌లాడుతాం..క్ష‌మాప‌ణ‌లు చెప్పుకుంటాం అని అంటున్నారు.. స‌రే ! అందాక విష‌యాన్ని లాగిందెందుకు?

మరింత సమాచారం తెలుసుకోండి: