తెలంగాణ రాష్ట్రంపై ఇలాగైనా పట్టు సాధించాలని బిజెపి పార్టీ అధిష్టానం వ్యూహాల  మీద వ్యూహాలు రచిస్తోంది. తమకు అందివచ్చినటువంటి ఎలాంటి అవకాశం అయినా వదులుకోకుండా వాడుకుంటూ వస్తోంది. కరీంనగర్ ఎంపీ  బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత బిజెపి తెలంగాణ రాష్ట్రంలో చాలా వరకు పట్టు సాధిస్తూ వస్తోంది. అమిత్ షా కూడా తెలంగాణలో ఏమైనా చేసి అధికారం సాధించాలనే ఆలోచనలను రాష్ట్ర నాయకులకు తెలియజేసినట్లు తెలుస్తోంది. ఆ దిశగానే ఇక్కడి రాష్ట్ర నాయకత్వం ముందుకు కదులుతోంది. ఈ దశలోనే బిజెపి పార్టీ నుంచి దుబ్బాక లో రఘునందన్ రావు, తర్వాత హుజురాబాద్ లో ఈటల రాజేందర్ బిజెపి పార్టీ నుంచి విజయం సాధించిన తర్వాత ఇంకా రాష్ట్ర క్యాడర్ లో కొత్త ఉత్సాహం కనబడుతోంది. ఈ విధంగా వీరంతా కలిసి  వ్యూహాలు రచిస్తూ  పార్టీని బలోపేతం చేయడానికి ముందుకు కదులుతున్నారు. అటు ఈటల రాజేందర్ ఇతర పార్టీల్లోని అసంతృప్తి నేతలను ఎలాగైనా పార్టీలోకి  తీసుకురావాలని ఆ దిశగా  అడుగులు వేస్తూ వస్తున్నారు.

 ఈ క్రమంలోనే వీరు తెలంగాణ ఉద్యమకారులు, నిరుద్యోగులపై మొదటగా దృష్టిపెట్టారు. తెలంగాణ ఉద్యమ రాజకీయ జేఏసీ కో చైర్మన్ గా పని చేసినటువంటి విటల్ ను కమలం గూటికి చేర్చుకుంది. ఈయనతోపాటు తీన్మార్ మల్లన్న అలాగే ఇంకొంతమంది ఉద్యమకారులను తొలివిడతగా పార్టీలో చేర్చుకోవడానికి బిజెపి పార్టీ భారీగా స్కెచ్ రెడీ చేసి పెట్టింది. తెలంగాణలో ఉద్యమాన్ని నడిపిన వారిలో సీఎం కేసీఆర్  ఎక్కువగా ఫోకస్ అయ్యారు. కానీ బ్యాక్ గ్రౌండ్ అంతా ఈటెల రాజేందర్  ఉన్నారని అందరికీ  తెలుసు. ఆనాడు టిఆర్ఎస్ శాసన సభ నాయకుడిగా ఈటల రాజేందర్ శాసనసభలో పోరాడిన విధానం ఇప్పటికీ మనం మర్చిపోలేం. తెరాస పార్టీలో ముందు నుంచి కెసిఆర్ వెన్నంటి ఉన్నటువంటి ఈటెల రాజేందర్ కు  ఆ పార్టీ లో ఏం జరుగుతుందో అంతా తెలుసు. ఉద్యమం కోసం పోరాడిన ఉద్యమకారులను పక్కనపెట్టి మిగతా వాళ్ళని పార్టీలో చేర్చుకుని ఉద్యమకారులకు కెసిఆర్ అన్యాయం చేశారని, దీంతో ఉద్యమకారులను అసంతృప్తితో ఉన్నారని ఈటెల రాజేందర్ కు తెలుసు.. దీంతో వారిని  ఎలాగైనా బిజెపి పార్టీ లోకి చేర్చాలని వ్యూహంతో ముందుకు పోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: