కృష్ణా జిల్లాలోని గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం ఒకప్పుడు నందమూరి ఫ్యామిలీ కి కంచుకోటగా వుండేది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఆయన తొలి రెండు ఎన్నికల్లోనూ గుడివాడ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆయన రాయలసీమ లోని హిందూపురం నుంచి గెలుస్తూ వచ్చారు. ఆ తర్వాత గుడివాడ నుంచి రావి శోభనాద్రి చౌదరి ఫ్యామిలీ వరుసగా విజయాలు సాధించింది. రావి శోభనాద్రి చౌదరి తో పాటు ఆయన ఇద్దరు తనయులు ఎమ్మెల్యేగా గెలిచారు. నందమూరి ఫ్యామిలీ అడ్డా గా పిలుచుకునే గుడివాడ ఇప్పుడు మంత్రి కొడాలి నాని అడ్డా అయిపోయింది.

2004 నుంచి వరుసగా జరుగుతూ వస్తున్న అని ఎన్నికల్లోనూ నాని పార్టీలతో సంబంధం లేకుండా భారీ విజయాలు నమోదు చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం వైసీపీ క్యాబినెట్లో మంత్రిగా ఉన్న నాని చంద్రబాబు , లోకేష్ ల పై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. నాని నోరు తెరిస్తే చంద్రబాబును లొకేష్ ను బూతులు తిడుతున్నారు. ఎలాగైనా నాని ని కంట్రోల్ చేయాలని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించాలని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీడీపీ శ్రేణులు కసితో ఉన్నాయి.

ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో గుడివాడ అసెంబ్లీ బరిలో నందమూరి ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరిని పోటీ చేయించాలని ప్రతిపాదనలు వస్తున్నాయి. నందమూరి ఫ్యామిలీ వారసుల్లో ఎవరో ఒకరు గుడివాడ నుంచి పోటీ చేస్తే కచ్చితంగా నందమూరి ఫ్యాక్టర్ అక్కడ బలంగా పని చేస్తుందని... కొడాలి నాని చిత్తు గా ఓడిపోతారని అంటున్నారు. ఇప్పటికే గుడివాడలో వరుసగా నాలుగు సార్లు గెలిచిన నాని నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి శూన్యం అని అంటున్నారు.

దానిపై ఇప్పుడిప్పుడే విమర్శలు కూడా పెరుగుతున్నాయి. నానిపై నియోజకవర్గంలో తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోంది. ఈ సమయంలో నంద‌మూరి ఫ్యాక్ట‌ర్ ఇక్క‌డ పని చేస్తే నాని ఓట‌మి ప‌క్కా అని అంటున్నారు. మరి నందమూరి వారసులు నాని పై సవాల్ చేసి పోటీ చేస్తారో ? లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: