తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గత 20 ఏళ్లలో విజయం సాధించ‌ని పరిస్థితులు ఉన్నాయి. జగన్ కు.. వైయస్ ఫ్యామిలీకి కంచుకోటగా ఉన్న రాయలసీమలో మాత్రమే కాదు తెలుగుదేశం పార్టీకి పట్టుగొమ్మగా ఉన్న కృష్ణ - గుంటూరు జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ 20 సంవత్సరాలుగా విజయం సాధించ‌ని ... పరిస్థితి ఉందంటే అక్కడ పార్టీ ఎంత బలహీనంగా ఉందో తెలుస్తోంది. ఉదాహరణకు గుంటూరు జిల్లాలోని నరసరావుపేట - మాచర్ల - బాపట్ల - గుంటూరు తూర్పు - మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలిచి 20 సంవత్సరాలు అవుతోంది.

అదే కృష్ణా జిల్లాలోని విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన 1983లో మాత్రమే విజయం సాధించింది. తిరువూరు నియోజకవర్గంలో కూడా చివరిసారిగా తెలుగుదేశం 1999లో మాత్రమే గెలిచింది. ఇదిలా ఉంటే గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ గత 20 సంవత్సరాలుగా గెలవని నియోజకవర్గాల‌లో వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తుంది అన్న అంచనాలు ఉన్నాయి. జిల్లాలోని బాపట్ల - నరసరావుపేట - మాచర్ల - మంగళగిరి నియోజకవర్గాల్లో ఈసారి తెలుగుదేశం పార్టీకి ఆశ‌లు కనిపిస్తున్నాయి.

మంగళగిరిలో గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నారా లోకేష్ మరోసారి అక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. ఈసారి లోకేషన్ కచ్చితంగా గెలిపించుకోవాల‌న్న క‌సి మంగళగిరి నియోజకవర్గ ప్రజల్లో కనిపిస్తోంది. బాపట్లలో నరేంద్ర వర్మ రూపంలో పార్టీకి బలమైన నేత దొరికారు. నరేంద్ర బాపట్ల గడ్డపై తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేసే ఎంతవరకు నిద్రపోకుండా పనిచేస్తున్నారు. గ‌త 20 ఏళ్ల‌తో వ‌ర్మ అంత బ‌ల‌మైన నేత ఆ పార్టీకి దొర‌క‌లేదు.

ఇక నరసరావుపేట లో చదలవాడ అరవింద్ బాబు గత ఎన్నికల్లో ఓడిపోయిన అప్పటినుంచి అధికార పార్టీ ఎమ్మెల్యే కంటే కూడా ఎక్కువగా ప్రజల్లో ఉండి క్రేజ్ తెచ్చుకున్నారు. మాచర్లలో వరుసగా నాలుగు సార్లు గెలుస్తూ వస్తున్నా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై ఈసారి వ్యతిరేకత ఎక్కువగా కనిపిస్తోంది. అక్కడ టీడీపీ నుంచి బలమైన అభ్యర్థిని నిలబెడితే అక్కడ కూడా టిడిపి జెండా ఎగరేసి సంకేతాలు కనిపిస్తున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: