ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వ పనితీరుపై ఉన్న ఉద్యోగ సంఘాలు దశల వారీ ఆందోళనకు సిద్ధమవుతున్న వేళ.. ముఖ్య మంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని సర్కారు వారికి ఓ చిన్న కమ్మటి కబురందించింది. దీని ప్రభావం ఉద్యోగులలో ఎంత మేర ప్రభావం ఉంటుందనేది ఇప్పడుప్పుడే చెప్పలేకున్నా.. ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ఇది ఉపయుక్తం కావచ్చు అనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది.
ఉద్యోగులకు సాధారణంగా మే నెలలో బదిలీలు జరుగుతాయి.  ఈ నెలలోనే ఎందుకు జరుగుతాయనే విషయం అందరికీ తెలిసినదే.  వేసవి శలవుల్లోనే బదిలీలుంటాయి. ఎందుకంటే ఉద్యోగుల పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంటుకుని ఈ బదిలీలు మే నెలలో జరుపుతారు. మే నెలలో విద్యార్థులకు వేసవి శలవులు ఇస్తారు. ఆంధ్ర ప్రదేశ్ లో జూన్ నెల నుంచి మార్చి, ఏప్రిల్ నెలల వరకూ విద్యా సంవత్సరం ఉంటుంది. విద్యాసంవత్సరం మధ్యలో ఉద్యోగుల బదిలీలు జరిగితే ఆ ప్రభావం విద్యార్థుల మీదపడే అవకాశం ఉందని గతం లో రాష్ట్రాన్ని ఏలిన ప్రభుత్వాలు గుర్తించాయి. దీంతో సాధారణ బదిలీలను మే నెలలో నిర్వహించడం రివాజు గా మారింది. మిగతా కాలం అంతా బదిలీలపై ప్రభుత్వం బ్యాన్ విధిస్తుంది.

ఆంధ్ర ప్రదేశ్ లో ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం పై దశలవారీ ఆందోళనకు సిద్ధమైన వేళ  ముఖ్యమంత్రి  వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రావత్  తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.  రాష్ట్రంలో బదిలీలపై ఉన్న నిషేధపు ఉత్తర్వులని ఎత్తివేశారు. అయితే ఇందులో కొంత మెలిక పెట్టారు. బదిలీల నిషేధాన్ని పూర్తిస్థాయిలో ఎత్తివేయ లేదు. పాక్షికంగానే నిషేదాన్ని ఎత్తివేశారు. ఒక ఉద్యోగితో , మరొగ ఉద్యోగి ఇష్టాపూర్వకంగా బదిలీ కోరితే, అట్టి వారిద్దరినీ బదిలీ చేయనున్నారు. అంటే మ్యూచువల్ అండర్ స్టాండింగ్ తో బదిలీలు జరుపుకోవచ్చు.  ఇందులోను మరో మెలిక ఉంది. బదిలీ కోరుతున్న ఇద్దరు ఉద్యోగులూ సమాన కేడర్ లోఉండాలి. ఇద్దరి మీద ఎలాంటి కేసులూ ఉండరాదు. అంతే కాక వీరి పై అధికారులు వీరి బదిలీని అంగీకరించాలి. వీరిద్దరూ కూడా ప్రాపర్ ఛానల్ ద్వారా బదిలీ దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది. ఇన్ని నిబందనలున్నా జనవరి 4వ తేదీ వరకూ ఈ తరహా బదిలీలకు అవకాశం ఉండటం గమనార్హం. ఉద్యోగుల్లో పరపతి కోల్పోయిందనే ఆరోపణలు ఎదుర్కోంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఉత్తర్వులు ఎంత మేర లాభం చేకూర్చ గలవో కాలమే నిర్ణయించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: