మంత్రి కేటీఆర్‌ను రాజ‌కీయంగా కొట్టేందుకు బీజేపీ వ్యూహాలు ప‌న్నుతుంది. అందులో భాగంగా సిరిసిల్ల నియోజ‌క‌వ‌ర్గంలో గ‌తంలో కేటీఆర్‌కు పోటీగా ఉన్న కేకే.మ‌హేంద‌ర్‌రెడ్డిని బీజేపీ త‌న వైపు తిప్పుకునేందుకు ప్లాన్ చేస్తోందా..? కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసే క్ర‌మంలో న‌లుగురిని విడ‌గొట్టి ఎక్క‌డిక‌క్క‌డ ఒక్కొక్క‌రిని దిగ్భంధించే ఆలోచ‌న‌లో కాషాయ ద‌ళం పార్టీ ఉందా అనే ప్ర‌శ్న‌ల‌కు.. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప‌రిణామాలు అవున‌నే అంటున్నాయి. కేసీఆర్ కుటుంబంలో.. గ‌జ్వేల్ -కేసీఆర్‌, సిరిసిల్ల‌- కేటీఆర్, నిజామాబాద్‌- క‌విత‌, సిద్ధిపేట‌లో హ‌రీష్ రావు ఉన్నారు.


  ఇక నిజామాబాద్‌లో అర‌వింద్ రంగంలోకి దిగి క‌విత‌కు చెక్ పెట్టి.. ముప్ప‌తిప్ప‌లు పెడుతున్నాడు. ఆ దెబ్బ‌కు భ‌య‌ప‌డి గెలుపు మీద న‌మ్మ‌కం లేక ఎమ్మెల్సీ రెన్యూవ‌ల్ చేయించుకుంద‌నే టాక్ న‌డుస్తోంది. సిద్ధిపేట‌లో చూస్తే ఎమ్మెల్సీగా వెంక‌ట్రామిరెడ్డి అక్కడ చ‌క్రం తిప్ప‌డం మొద‌లుపెట్టేశాడు. మ‌రోవైపు సిద్ధిపేట‌లో ఓ బ‌డా రెడ్డిని రంగంలోకి దింపేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇక కేటీఆర్ విష‌యం చూస్తే.. ఆయ‌న ఇండియాకు రాక‌ముందు సిరిసిల్ల‌లో జైతెలంగాణ నినాదాన్ని గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు తీసుకువెళ్లిన ఘ‌న‌త కేకే మ‌హేంద‌ర్ రెడ్డికి ఉంద‌నే చెప్పాలి.


 కానీ, అప్ప‌టివ‌ర‌కు సిరిసిల్ల ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా ఉన్న కేకేను ప‌క్క‌న పెట్టిన కేసీఆర్.. ఆ సీటును త‌న కొడుకు కేటీఆర్‌కు ఇచ్చుకున్నాడు. దీంతో కేకే ఇండిపెండెంట్‌గా పోటీ చేసి కేవ‌లం 170 ఓట్ల‌తో ఓట‌మి పాల‌య్యారు. త‌రువాత తాను వైఎస్సార్‌సీపీ, ఆ త‌రువాత కాంగ్రెస్‌లో చేరారు. త‌రువాతి ఎన్నిక‌ల్లో పోటీ చేసినా గెల‌వ‌లేక‌పోయారు కేకే. అయితే, ఇప్పుడు కేటీఆర్‌ను ఢీ కొట్టాలంటే బీజేపీకి ఎటువైపు నుంచి చూసినా కేకే.మ‌హేంద‌ర్ రెడ్డి క‌నిపిస్తున్నాడు. దీంతో కేకేతో స‌హ‌చ‌ర‌త్వం ఉన్న వివెక్ వెంక‌ట‌స్వామి, డీకే అరుణ‌, ఈట‌ల రాజేంద‌ర్ కూడా కేకే ను ఎలాగైనా బీజేపీలోకి తీసుకురావాల‌ని క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్టు స‌మాచారం. ఇక వెళ కేకే బీజేపీలో చేరితే కేటీఆర్‌కు గ‌ట్టిపోటీ ఇచ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.







మరింత సమాచారం తెలుసుకోండి: