విలయాల్లో కదిలి వచ్చే శక్తులు
విపత్తులలో కదం తొక్కే శక్తులు
చైతన్య కాంతులు
అవును ఆ శక్తి కొన్ని కోట్ల జనంకు
ఆరాధనీయం కావొచ్చు..
శక్తి అభిమానుల్లో్  కొత్త ఉత్సాహం
నింపనూ వచ్చు..




సంసార సాగరం నాది సన్యాసం శూన్యం నాదే నాదే అని పాడుకున్న సందర్భాలివి.. కానీ ఆయన సంసారం అనే పదానికి ఈ ప్రపంచం నాదే అని అర్థం ఇచ్చారని తనికెళ్ల భరణి చెప్పారు. అవును! అలాంటి ప్రపంచం ముఖ్యంగా చెప్పాలంటే ఇవాళ తెలుగు  రాష్ట్రాలూ ఎన్నో ఒడిదొడుకుల్లో ఉన్నాయి. రాక్షస వానల క్రీనీడల్లో పంటలు పోయి 33వేల కోట్ల రూపాయల నష్టంలో ఉన్నాయి. బాధిత జీవాలకు  అండగా ప్రభాస్ తనవంతు కర్తవ్యం పాటించి సహృదయతకు సంకేతం అయ్యారు. కోటి రూపాయల విరాళం అందించి గతంలో మాదిరిగానే మనసున్న మారాజు అన్న మకుటానికి అర్థం చెప్పారు. అర్హత మరియు అన్వయం సాధించారు మరోసారి!



కరోనా కల్లోలాలు ప్రకృతి విలయాలు
ఉన్న వేళ  తోటివారి మేలు కోరి
చేసిన సాయం కోటి రూపాయలు
దటీజ్ ప్రభాస్ సాహోరే బాహుబలి
నిజంగానే నిజంగానే
భువనాలు జైకొట్టాల్సిందే!



వరదలు వచ్చి పంటలను ముంచేశాయి.. తుఫానులు వచ్చి రాక్షస వానలు మోసుకువచ్చాయి.. జగమంత కుటుంబం నాది అనుకునే కథానాయకుడు తన వంతు మానవతకు అర్థం తెలిపారు. తన వంతు బాధ్యతకు గళం అందించారు. హృదయమున్న తార.. వరదల్లోనూ కరోనా విలయాల్లోనూ తోటి వారి ఇబ్బందినీ సమస్యలనూ అర్థం చేసుకున్న తార. సినీ తార అని రాయడంలో  తప్పక మంచి ఔన్నత్యం ఉంది. కానీ నేను తార అనే రాస్తాను.. ఈ వెలుగు కారణంగా ఎందరికో అన్నం దొరకనుంది. మిగతావారి ప్రయాణానికి ఓ ఆదర్శం కానుంది. అవును! ఇచ్చిన చేయికి మొక్కాలి అని రాశారో చోట.. దండాలు సామీ.. ధన్యవాదాలు సామీ అని ఆంధ్రావని  ఇవాళ ఆయనకు నీరాజనాలు పలుకుతోంది. రాజసం అంటే అర్థం దాన గుణంలో రాజసం సేవా దృక్పథంలో రాజసం..పరులెవ్వరినీ పరుష పదజాలంతో నొప్పించక నడవడిలో రాజసం.. ఇవన్నీ రాజు గుణాలే అయితే ఆ రాచరికపు ప్రతినిధి ప్రభాస్.




కోటి తారల్లో ఒకడు.. కోటి మందికి ఆదర్శం అతడు.. అవును అతడు ప్రభాస్.. రెబల్ స్టార్.. సాయంలో బాహుబలి. ఆదుకోవ డంలో మనసున్న మారాజు.. వాట్ నాట్ వాట్ ఎల్స్. అవును ఆయన ఇప్పుడే కాదు గతంలోనూ విలయాల వేళ విపత్తుల వేళ తనవంతు బాధ్యతను నిర్వర్తించారు. తనవంతు ఆర్థిక చేయూత అందించి నిజంగానే పండుగలా దిగివచ్చాడు.. దాతృత్వంలో పెద్దయ్య పేరు నిలబెట్టారు. తాజాగా వరదలతో కునారిల్లుతున్న ప్రాంతాలకు, సంబంధిత బాధిత ప్రజలకు కోటి రూపాయలు విరాళం ఏపీ సీఎం జగన్ రిలీఫ్ ఫండ్ కు అందించి మానవతను చాటుకున్నారు. త్వరలో ఇందుకు సంబంధించిన చెక్ ఒకటి ఏపీ సీఎంఓకు పంపనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: