ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కొద్దిరోజులుగా ఏపీలో అధికార వైసీపీ నేతలకు టార్గెట్గా మారారు. ముఖ్యంగా బద్వేలు ఉప ఎన్నికల్లో సోము వీర్రాజు బిజెపి తరఫున గట్టిగా ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో బీజేపీ వర్సెస్ వైసీపీ నేతల మధ్య తీవ్రమైన మాటల యుద్ధం నడిచింది. ఈ క్రమంలోనే వైసీపీ నేతలు వీర్రాజు ను టార్గెట్గా చేసుకొని తీవ్రమైన విమర్శలు చేశారు. అప్పటినుంచి సోము వీర్రాజు కూడా వైసీపీ ని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఈరోజు వీర్రాజు మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తనకు పదవులపై వ్యామోహం లేదని ... 2024 తర్వాత తాను రాజకీయాల్లో ఉండ‌నని చెప్పారు.  ఇక వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అవినీతిపరుడు అని ఆయన బిజెపిలో చేరుతున్నారు ... అంటూ వైసీపీ నేతలు ఇప్పుడు మాట్లాడుతున్నారని ... మరి రఘురామ కృష్ణంరాజు ను పార్టీలో చేర్చుకుని ఎంపీ టికెట్ ఇచ్చినపుడు ఆయన అవినీతి వైసీపీ నేతలకు గుర్తుకు రాలేదా ? అని వీర్రాజు ఎద్దేవా చేశారు.

ఇక సోము వీర్రాజు కు డిపాజిట్లు కూడా రావని వైసీపీ నేతలు పదేపదే ఎద్దేవా చేస్తున్నారని తాను ఏనాడు పదవులకోసం పాకులాడే మనిషి ని కాదని సోము వీర్రాజు చెప్పారు. ఇక 2014 ఎన్నికల్లో బుచ్చ య్య చౌద‌రి ని పక్కన పెట్టి తనకు రాజమండ్రి టిక్కెట్ ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని... అలాగే గెలిచాక మంత్రి పదవి కూడా ఇస్తానని బాబు చెప్పినా తాను వద్దన్నా అంటూ సోము వీర్రాజు సంచలన విషయం బయటపెట్టారు.

2024 తర్వాత తాను రాజకీయాల్లో ఉండనని.. సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. ఆయ‌న ఈ రోజు ఎందుకు ఈ ప్ర‌క‌ట‌న చేశారా ? అన్న‌ది అంతు ప‌ట్ట‌డం లేదు. మరి దీనిపై బిజెపి లోని మిగిలిన నేతల నుంచి ఎలాంటి వ్యాఖ్యలు బయటకు వస్తాయో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: