చైనా కంపెనీలకు అమెరికా భారీ షాక్ ఇచ్చింది. చైనా, అమెరికాల మధ్య మరోసారి ట్రేడ్ వార్ మొదలైంది. యూఎస్ మార్కెట్ నియంత్రణ సంస్థ కీలక నిబంధనలకు ఆమోదం తెలపడంతో చైనా కంపెనీలు సమస్యల్లో పడ్డాయి. చైనా కంపెనీల తనిఖీలకు సంబంధించి వివరాలను బహిర్గతం చేసింది. అమెరికా స్టాక్ ఎక్స్చేంజి లో నమోదైన చైనా కంపెనీల ఆడిటింగ్ యూఎస్ పబ్లిక్  కంపెనీస్ అకౌంటింగ్ ఓవర్ సైట్ ఫోర్ పర్యవేక్షణ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని స్పష్టం చేసింది. లేదంటే ఆ కంపెనీల షేర్లో అమెరికా స్టాక్ ఎక్స్చేంజి లో ట్రేడ్ అయ్యేందుకు అనుమతించేది లేదని తెలిపింది. దీనికి తోడు ఆ కంపెనీలు తమ వార్షిక నివేదికల్లో ఆ కంపెనీలు ప్రభుత్వం కంపెనీయా లేక ప్రభుత్వానికి ఏమైనా కంట్రోలింగ్ వాటా వుందా అని కూడా స్పష్టం చేయాలని తెలిపింది. అమెరికా స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్  తాజా ఉత్తర్వులు చైనా కంపెనీలకు తలనొప్పిగా మారాయి. అమెరికా నుంచి చైనా కంపెనీలు నిధులు సేకరించడం ఇక అంత సులభం కాదు.

అమెరికా స్టాక్ ఎక్స్చేంజి లో లిస్ట్ అయిన విదేశీ కంపెనీలు తమ ఆడిట్ కు సంబంధించి అదనపు సమాచారాన్ని వార్షిక నివేదికలో బహిర్గతం చేయాలని అలాగే ఆయా కంపెనీల ను తనిఖీ చేసిన ఆడిటర్లు లేదా ఆడిట్ సంస్థలను సమీక్షించేందుకు పిసిఎఓబి ని అనుమతించాలని నిర్ణయించడం దీంతోపాటు కంపెనీలో చైనా ప్రభుత్వానికి వాటాలు ఉన్నాయా లేవా అనేది తెలియజేయాలని సూచించడం చైనా కమ్యూనిస్టు పార్టీతో సంబంధాలు వెల్లడించడం వంటి అంశాలు చైనా కంపెనీలకు షాక్  ఇచ్చేవిగా మారాయి. ఇప్పటికీ చైనాలో అధికార కమ్యూనిస్టు పార్టీ తో సంబంధాలున్న కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడాన్ని అమెరికా నిషేధించింది. ఆర్థికంగా బలంగా ఉన్న అమెరికా నుంచి నిధులు సేకరించి చైనా కంపెనీలు ప్రయోజనం పొందుతున్నాయి. చైనా టెక్నాలజీ రంగంలో వస్తున్న గణనీయ వృద్ధిని అమెరికా ఇన్వెస్టర్లు సొమ్ము చేసుకుంటున్నారు. ఈ రెండు వర్గాలకు అమెరికా తాజా నిర్ణయం షాకింగ్ వంటిది. అమెరికా మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ నిబంధనలతో చైనా కంపెనీలు ఖంగుతిన్నాయి. మరి ఇప్పుడు ఆ కంపెనీలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: