చైనా నుంచి ప్రపంచ దేశాలకు పాకి పోయిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలు పట్టి పీడిస్తూనే ఉంది. కరోనా వైరస్ ప్రభావం తగ్గుతుంది అని ఆనందపడి లోకి మరో దశ కరోనా వేరియంట్  వెలుగులోకి వచ్చి వేగంగా వ్యాప్తి చెందుతూ వుండటం గమనార్హం. ఏకంగా ప్రస్తుతం కరోనా వైరస్ రూపాంతరం చెందుతున్న తీరు మానవాళికి ముప్పు గా మారిపోతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఏకంగా మానవాళి మనుగడకే సవాల్ విసురుతూ రూపాంతరం చెందుతూ వేగంగా వ్యాప్తి చెందుతూ ఎంతోమంది పై పంజా విసురుతుంది మహమ్మారి కరోనా వైరస్. ముఖ్యంగా  అగ్రరాజ్యాల లోనే ఈ కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది.


 ప్రపంచదేశాలకు పెద్దన్నగా ఉన్న అమెరికాలోనే అన్ని దేశాల కంటే ఎక్కువగా కరోనా వైరస్ ప్రభావం కూడా వెలుగులోకి వచ్చింది. అంతేకాకుండా ఫ్రాన్స్, జర్మనీ, యుకె లాంటి దేశాలలో కూడా కరోనా వైరస్ విజృంభించింది. ఇక ఇప్పుడు మరోసారి కరోనా వైరస్ అగ్రరాజ్యాల ను వణికిస్తోంది. అగ్రరాజ్యాలను పెను సంక్షోభం దిశగా తీసుకుపోతుంది కరోనా వైరస్. గతంలోనే రెండవ దశ కు మాత్రమే కాదు మూడవ దశ ను కూడా ఫ్రాన్స్ ఎదురుకుందని  నిపుణులు తెలిపారు. ఇక ఇప్పుడు ఫ్రాన్స్ లో ఒక రకంగా నాలుగవ దశ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది అని చెప్పాలి.



 చూస్తూ చూస్తుండగానే అగ్రరాజ్యాల లో ఒకటైన ఫ్రాన్స్ లో కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒక్క రోజుల్లో ఏకంగా 50 వేల కేసులు వెలుగు లోకి వస్తూ ఉండడం ఆందోళనకరంగా మారిపోయింది. ఇప్పటికే విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికుల పట్ల కఠిన ఆంక్షలు అమలులోకి తీసుకు వచ్చారు.. టీకా ప్రక్రియ ఎంతో వేగంగా కొనసాగిస్తున్నారు. ఇక ప్రజలందరిలో అవగాహన తీసుకువచ్చి నిబంధనలు పాటించే విధంగా ప్రభుత్వ అధికారులు చూస్తున్నారు. కానీ ఫ్రాన్స్ లో కేసులు పెరిగిపోతుండటంతో ఏం చేయాలో తెలియక ప్రభుత్వం ఆందోళనలో మునిగిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఇలా కేసులు పెరిగిపోతూ ఉండడం ఫ్రాన్స్ ను సంక్షోభం లోకి తీసుకు పోతుంది అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: