పాకిస్తాన్లో పరిస్థితి రోజు రోజుకు అధ్వానంగా మారిపోతుంది. పాకిస్తాన్ ప్రభుత్వ తీరు కారణంగా ఆ దేశంలో రోజురోజుకీ సంక్షోభాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఇక ఎన్నో రోజుల నుంచి పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం ఎంతగానో వేధిస్తుంది అన్న విషయం తెలిసిందే. కనీసం పాకిస్థాన్ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని స్థితిలోకి దివాలా తీసింది పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి. ఇలాంటి సమయంలో అటు ఎప్పుడెప్పుడు సహాయం చేస్తే అరబిక్ దేశాలు సైతం ప్రస్తుతం పాకిస్తాన్ను పట్టించుకోకపోవడంతో పాకిస్తాన్ పరిస్థితి రోజురోజుకు అధ్వానంగా మారిపోతుంది.


 ఇదే ఇదే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్న చైనా ఎక్కువ వడ్డీ తో కూడిన రుణాలు అందజేస్తూ పాకిస్థాన్  ను పూర్తిగా తమ చెప్పుచేతల్లో కి తీసుకు వస్తుంది. అయితే ఇప్పటికే పాకిస్తాన్ చైనా చెప్పు చేతుల్లోకి వెళ్ళిపోయింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇదే విషయాన్ని గ్రహించిన పాకిస్తాన్ ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో నిరసనలు తెలుపుతున్నారు. ఇలా పాకిస్తాన్లో రోజురోజుకు ఉద్యమం పెరిగిపోతుంది అని చెప్పాలి. ఇప్పటికే ఎన్నో ప్రాంతాల్లో ప్రజలు ఉద్యమ బాట పట్టి రోడ్లపైకి చేరుతున్నారు.


 ఇలా పాకిస్తాన్లో అంతకంతకూ పెరిగిపోతున్న అంతర్యుద్ధం పాకిస్థాన్ ను మరోసారి ముక్కలు చేయబోతుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. ఎందుకంటే ఒకప్పుడు పాకిస్థాన్లో ఉద్రిక్త పరిస్థితులు ఎక్కువ అవ్వడం తో ఇక భారత్ కలగజేసుకుని ఇక పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్ ను ఒక ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేసింది. ఇప్పుడు కూడా అదే జరగబోతుందో అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే  అలాగే ఉన్నాయి అని అంటున్నారు విశ్లేషకులు. బెలూచిస్థాన్ లో లక్షలాది మంది ప్రజలు రోడ్ల మీదికి వచ్చి నిరసన తెలుపుతున్నారు. చైనా పాకిస్తాన్ కార్యకలాపాలను అడ్డుకుంటున్నారు . చైనా సిపెక్ లో నిర్వహిస్తున్న టువంటి పోర్టు కారణంగా లక్షలాది మంది ఉపాధి కోల్పోతున్నారు. దీంతో ఇక ప్రజలందరూ తిరుగుబాటు చేస్తూ అంతర్యుద్ధానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: