పార్లమెంట్ సమావేశాలు జోరుగా సాగుతున్నాయి. గత అనుభవాలతో ఎవరెవరు సభను జరగకుండా చూడాలని అనుకుంటున్నారో గ్రహించి వారిని ముందుగానే సస్పెండ్ చేశారు. అయినా ఉన్న విపక్షాలు మొదటి రోజు నుండే ఇష్టానుసారంగా ప్రవర్తించడం చూశాము. అసలు ఈ సమావేశాలకు ముందుగానే సభికులు అందరు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని మోడీ స్వయంగా స్పష్టం చేశారు. ముందు చెప్పడం తప్పైపోయినట్టే ఉంది అందుకే మొదటి రోజు సమావేశాలే వాయిదా పర్వంతో ముగిశాయి. దీనితో ప్రజా సమస్యలపై చర్చించాలనే ఉద్దేశ్యం ఆయా సభికులకు ఉన్నట్టుగా లేదని తేలిపోయింది. ఇదంతా విపక్షాల తీరు తెన్నులు. వీళ్ళ రచ్చతో విసిగిపోయినట్టుగా ఉన్నారు ప్రధాని మోడీ, అందుకే వాళ్ళ సభికుల గైర్హాజరును అడ్డుపెట్టుకొని అందరికి సున్నితంగా వాతలు పెట్టినట్టు మాట్లాడారు.

నేడు పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడిన ప్రధాని పార్లమెంట్ ఏమి పాఠశాల కాదు, పిల్లలకు చెప్పినట్టుగా హాజరు కావాలని చెప్పడం సాధ్యం కానీ పని, సభికులు తమ విధులు గుర్తెరిగి ప్రవర్తించాలని సున్నితంగా హెచ్చరించారు. అలా కానీ పక్షంలో మార్పుల గురించి ఆలోచించాల్సి వస్తుందని స్పష్టం చేశారు. అలాగే పద్మ అవార్డులు పొందిన వారిని గౌరవించాలని సూచించారు. సమావేశాలకు కూడా తప్పకుండ హాజరు అవ్వాల్సిన బాధ్యత ప్రతి సభ్యుడికి ఉన్నది. తమ ప్రాంతాలలో ఉన్న సమస్యలను గురించి చర్చించాల్సిన బాధ్యత మీపై ఉన్నది. అందుకు ముందు మీ ప్రాంతాలలో ప్రజలతో మమేకం కావల్సిన అవసరం ఉంది.

అలా ప్రజలలో కలిసిపోవడానికి అవసరం అయితే తగిన ఈవెంట్ లను జరపాలని మోడీ తెలిపారు. అప్పుడే ప్రజలతో కలిసిపోవడం జరుగుతుంది, వాళ్ళు కూడా తమ సమస్యలు తెలుపడానికి ముందుకు వస్తారు. తద్వారా ఆయా సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవచ్చు. ఇదంతా ఒక నేతకు చెప్పాల్సిన పని లేదు. ఈ స్థాయిలో ఉండి కూడా ఇవన్నీ చెప్పించుకుంటే నేతగా ఉండాల్సిన అవసరం లేదు. పార్లమెంట్ పార్టీ సమావేశానికి సీనియర్ నేతలు అమిత్ షా, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా హాజరయ్యారు. నవంబర్ 15 ను బిర్సా ముండా జయంతిని, జాన్ జాతీయ గౌరవ్ దివస్ గా ప్రకటించినందుకు ఎంపీలు ప్రధానికి కృతఙ్ఞతలు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: