పేదల పట్ల చిత్తశుద్ధి అనేది కేవలం చెప్పడంలో కాదు, చేసి చూపించాల్సి ఉంటుంది. అది దాదాపుగా నేతలలో కరువవుతుంది. దాదాపుగా అలాంటి వారికి కనీస హక్కులు ఉండకూడదు అన్నట్టుగా ప్రస్తుత రాజకీయ నేతల తీరు తెన్నులు ఉంటున్నాయి. వాళ్ళ గురించి ఆలోచించే నేతలు ఎక్కడో ఒకరు ఉంటె, అతడిని కూడా పని చేయనీయకుండా అడ్డుపడే శక్తులు బోలెడు. ఇలాంటివి వాళ్ళు చేసే పనులకు పేదవాడి నోటి కాడకు వచ్చిన కూడు వారికీ చేరకుండానే పోతుంది. దీనిని చేయడం వలన వాళ్లకు ఒరిగేది ఏమిటో అర్ధం కాదు. కానీ ఇలాంటి రాజకీయాలు చేస్తూనే ఉండటం శోచనీయం.

ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న ఓటిఎస్ విషయంలో జారుతుంది అదే. ప్రభుత్వం పేదలకు దాదాపుగా 32 లక్షల ఇళ్లను ఇచ్చే బృహత్తర కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. అలాంటి ప్రభుత్వం ఇతర గృహస్తులను ఓటిఎస్ రూపంలో బాధిస్తారని లేనిపోని ప్రచారం చేస్తున్నారు. ఇలా చేస్తే తమ ఓటు బ్యాంకు పై ప్రభావం పడదా అనేది ప్రభుత్వం ఆ మాత్రం అంచనా వేసుకోదా, నిజానికి అక్కడ ప్రభుత్వం అంటుంది ఏమిటి, ఇక్కడ ఓటిఎస్ ను బలవంతంగా ఎక్కడా వసూలు చేయడం లేదు. ప్రభుత్వానికి ఎప్పటి నుండో కట్టవలసిన మొత్తాన్ని చెల్లించని వారికి మరో అవకాశం ఇస్తుంది ప్రభుత్వం. అదికూడా ఎవరికీ బరువు కాకుండా ఒక్కరితో పోయే తట్టుగా ఇంతని ఒక మొత్తాన్ని నిర్ణయించింది. దానిని చెల్లించే మార్గం కూడా చెపుతూనే ఉంది.

ఒకవేళ బ్యాంకు వద్ద లోను తీసుకోని ఇళ్లు కట్టుకుని, ఈఎంఐ కట్టకపోతే ఏమి చేస్తారు, కొన్నాళ్ళు చూస్తారు, తరువాత ఇళ్లు వేలం వేసి పరువు తీసి, తమకు రావాల్సింది వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోతారు. ఇలాంటి పని ప్రభుత్వం చేయబోవడం లేదే. ఈ లబ్ది పొందాల్సిన వారు  వద్దు అనుకుంటే దానిని ఫోకస్ చేయడం మంచిదే. ప్రభుత్వం ఓటిఎస్ ద్వారా లబ్ది దారులకు తమ తమ ఆస్తులను శాశ్వతంగా హక్కులు ఇస్తున్నది, దానిని వద్దంటే అర్ధం ఉండాలి కదా. ప్రజలకు అసలు ఇందులో ఉన్న విషయం అర్ధం కాకుండా ఇష్టానికి దుష్ప్రచారం చేసుకుంటూపోవడం ఎంతవరకు సబబు అనేది ఆయా పార్టీలు ఆలోచించుకోవాలి. రిజిస్ట్రేషన్ చార్జీలు తీసుకోవడం మొదలుపెడితే ఒక్కొక్కరికి  ఎంత ఖర్చు అవుతుంది అనేది అందరికి తెలిసిందే, అవన్నీ కాకుండా ఓటిఎస్ ద్వారా కొద్దిలో పని అయిపోయేట్టుగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. అది ఆయా వర్గాల ప్రజల ఆర్థిక స్థితిగతులు తెలుసుకుని, ఆ ప్రణాళికలు రూపొందించింది. అందుకే ఒక్కరితో అయిపోతే, వాళ్లకు సుస్థిరమైన ఆస్తి అనేది ఉంటుంది అనే భరోసా ఉంటుంది. దానికేమిటి సమస్య. లబ్దిదారులకు అసలు విషయం అర్ధం కాకుండా యాగీ చేసి ఏమి బాగుకుంటారు, ఫలితం ఏమిటి. అంటే ఇక్కడ పరిస్థితి ఏమిటంటే, మనం పెట్టాము, ఎవడో పెడుతుంటే అదికూడా దక్కనీయం అన్నట్టే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: