అమెరికా ఉపాధ్యాక్షురాలు క‌మ‌ల హారిస్ బాధ్య‌త‌లు స్వీక‌రించ‌డంతో అత్యంత గర్వించిన దేవం భారత్‌. భార‌త సంత‌తి మ‌హిళ అగ్ర‌రాజ్యానికి ఉపాధ్యాక్షురాలిగా వ్య‌వ‌హ‌రించ‌డం అనేది మామూలు విష‌యం కాదు. అమె ఎన్నిక‌పై ప్ర‌పంచ దేశాలు హ‌ర్షించాయి. అధ్య‌క్షుడు జో బైడెన్ క‌మ‌ల హారిస్‌కు అత్యంత ప్రాధాన్య‌త ఇస్తూ వ‌చ్చాడు. అంతే కాకుండా కీల‌క‌మైన ప‌ద‌వులు అప్ప‌గిస్తూ అమెకు అధికారాలు అప్ప‌గించారు. ఇటీవ‌ల బైడెన్ ఆరోగ్యం ప‌రీక్ష‌ల కార‌ణంగా క‌మ‌ల హ‌రీస్ గంట‌పాటు అధ్య‌క్షురాలిగా బాధ్య‌ద‌త‌లు అప్ప‌గించారు.

 
ఉపాధ్యాక్షురాలు కాక‌ముందే సెన‌ట‌ర్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌హించి అనేక సంస్క‌ర‌ణ‌లు తీసుకువ‌చ్చారు. గ‌తేడాది జ‌న‌వ‌రి 20న ప్రెసిడెంట్ అభ్య‌ర్థిగా నామినేష‌న్ వేశారు. కానీ, కావాల్సిన ఫండ్స్ లేక‌పోవ‌డంతో నామినేష‌న్ విత్‌డ్రా చేసుకున్నారు. ఆ త‌రువాత 2020 మార్చిలో అమెరికా ప్రెసిడెంట్ అభ్య‌ర్థిగా జోబైడెన్‌ను బ‌ల‌ప‌రిచారు క‌మ‌ల హారిస్‌. అమెరికా తొలి వైస్ ప్రెసిడెంట్‌గా చ‌రిత్ర‌కెక్కిన భార‌త సంత‌తికి చెందిన క‌మ‌ల హారిస్‌కు ఇటీవ‌ల వైట్‌హౌజ్ లో ప్రాధాన్య‌త త‌గ్గింతుందా..?  బాధ్య‌తల నిర్వ‌హ‌ణ‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా అంటే అవున‌నే అంటున్నాయి ప్రముఖ మీడియా సంస్థ‌లు.


 
క‌మ‌ల హారిస్‌తో అధ్య‌క్ష‌డు జో బైడెన్ కీల‌క బృందంలోని స‌భ్యుల‌తో పొస‌గ‌డం లేదని, ఫ‌లితంగా పాల‌నా విభాగంలో ఆమె పాత్ర క్ర‌మేపి త‌గ్గుతోందని కొన్ని అంత‌ర్జాతీయ వార్తా సంస్థలు క‌థ‌నాలు వెలువ‌రించాయి. క‌మ‌ల క‌మ్యూనికేష‌న్ డైరెక్ట‌ర్ ఆశ్లే ఇటైనీ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకుంటున్నార‌ని తొలుత వార్త‌లు వ‌చ్చాయి. ఉపాధ్యాక్షురాలిగా ముఖ్య అధికార ప్ర‌తినిధిగా ప‌నిచేస్తున్న సైమున్ సాండ‌ర్స్ ఈ ఏడాది ప‌ద‌వి నుంచి వైదొల‌గ‌నున్నారు. హారిస్ బృందంలో ఈ ఇద్ద‌రు ముఖ్య‌మైన వాళ్లు.. ఎన్నిక‌ల ప్ర‌చారంలో క‌మ‌ల‌ను ముందుండి న‌డిపించి, ఆమె నాయ‌క‌త్వ ప‌ఠిమ‌ను విజ‌య‌వంతంగా అమెరికా ప్ర‌జ‌ల ముందు ఉంచ‌డంలో కీల‌క భూమిక పోషించారు వీళ్లు. అయితే, ఈ ఇద్ద‌రు ఒకేసారి క‌మ‌ల హారిస్‌కు దూర‌మ‌వ‌డం యాదృశ్చికం కాద‌ని ఓ సీనియ‌ర్ వార్తా సంస్థ పేర్కొంది. వైట్ హౌజ్‌లో అంత ఒకే లేద‌ని ఏదో తేడా కొడుతుంద‌ని భావిస్తోంది.








మరింత సమాచారం తెలుసుకోండి: