టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గత కొన్నాళ్లుగా తెలుగుదేశం పార్టీ వ్యవహారాల మీద పెద్దగా జోక్యం చేసుకోవడం లేదు అని ప్రచారం జరుగుతోంది. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉన్నా సరే నారా లోకేష్ ఈ మధ్యకాలంలో ఉత్సాహంగా కనపడకపోవడం కార్యకర్తలు అదేవిధంగా అభిమానుల్లో అదేవిధంగా స్థానిక నాయకత్వం లో ఉత్సాహం తీసుకువచ్చే విధంగా ప్రయత్నం చేయకపోవడం అనేది కాస్త ఇబ్బంది పెడుతున్న అంశంగా టీడీపీ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి కాస్త గడ్డు పరిస్థితులు ఉన్నా సరే నారా లోకేష్ క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్ళక పోవడం వెనుక ప్రధాన కారణం ఏంటనేది తెలియటం లేదు.

రాజకీయంగా తెలుగుదేశం పార్టీ కాస్త ఉత్సాహంగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నా సరే కొన్ని కొన్ని అంశాల్లో మాత్రం వెనకడుగు వేయడం కాస్త ఆందోళన కలిగిస్తున్న అంశం. అయితే నారా లోకేష్ విషయంలో చంద్రబాబు నాయుడు కాస్త సీరియస్ గా   ఉన్నారనే ప్రచారం కూడా టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. నారా లోకేష్ సైలెంట్ గా ఉండటానికి ప్రధాన కారణం ఏంటనేది తెలియకపోయినా ప్రజల్లోకి మళ్ళీ చంద్రబాబు నాయుడు సానుభూతి పేరుతో వెళ్లే అవకాశం ఉందని అందుకే నారా లోకేష్ ను ఇప్పట్లో పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని చెప్పినట్టుగా కూడా సమాచారం

అందుకే చంద్రబాబు నాయుడు వరద బాధిత ప్రాంతాలకు వెళ్లి ప్రజలతో మాట్లాడారని త్వరలోనే మరిన్ని పర్యటనలు కూడా చంద్రబాబు నాయుడు చేసే అవకాశం ఉందని అవసరమైతే బస్సుయాత్ర లేకపోతే పాదయాత్ర పేరుతో ఆయన ప్రజల్లోకి వెళ్లే అవకాశాలు ఉండవచ్చు అనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి కొన్ని కొన్ని అంశాలు ఇబ్బందికరంగా మారిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ప్రతి అంశాన్ని కూడా సీరియస్ గా తీసుకుని క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి గట్టిగానే కష్టపడుతున్నారు. మరి ఆ పార్టీకి భవిష్యత్తులో పరిస్థితి ఏ విధంగా కలిసి రాబోతున్నాయి ఏంటి అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: