ఎన్నో ఏళ్ల నుంచి తైవాన్ ను తమ దేశం లో భాగంగా మార్చుకోవాలని ప్రయత్నిస్తుంది చైనా. కానీ ప్రపంచ దేశాలు మాత్రం చిన్న దేశమైన తైవాన్ కు అండగా నిలబడుతూ వస్తున్నాయి.. దీంతో పలు మార్లు చైనా తైవాన్ ను ఆక్రమించుకోవాలని అనుకున్నప్పటికీ వెనక్కి తగ్గింది. కానీ ఇటీవలి కాలంలో తైవాన్ సరిహద్దులో చైనా పనులు మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి. ఏ క్షణంలో తైవాన్ చైనా మధ్య యుద్ధం జరుగుతుందో అనే విధంగా మారిపోతున్నాయి పరిస్థితులు. అయితే తైవాన్ జోలికి వస్తే ఊరుకునేది లేదు అంటూ అమెరికా హెచ్చరించినప్పటికీ కూడా అటు చైనా మాత్రం వెనక్కి తగ్గక పోవడం గమనార్హం.


 చైనా తైవాన్ సరిహద్దుల్లో భారీగా యుద్ధ విమానాలను మోహరించడం సైనికులను మోహరించటం లాంటివి చేస్తుంది చైనా. ఏకంగా ఇటీవల కాలంలో తైవాన్ గగనతలంలో చైనా యుద్ధ విమానాలను కూడా పంపించడం మరింత సంచలనం గా మారిపోయింది. ఇప్పుడు తైవాన్ సరిహద్దులో చైనా పెద్ద ఎత్తున యుద్ధ విన్యాసాలు చేస్తూ ఉండడం సంచలనంగా మారిపోయింది. తైవాన్ లో ఉన్న దీవులను ఆక్రమించుకునే సమయంలో ఏర్పడే పరిస్థితులను ఎదుర్కోవడం ఎలా అన్న విషయంలోనే ఇక చైనా సరిహద్దుల్లో యుద్ధ విన్యాసాలు చేస్తుంది అన్నది ప్రస్తుతం విశ్లేషకులు చెబుతున్న మాట.


 అయితే అటు తైవాన్ సరిహద్దులో చైనా భారీగా యుద్ధ విన్యాసాలు చేస్తూ ఉండటం పై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది అమెరికా. ఇక ఇటీవలే అమెరికా ఏకంగా చైనాకు తైవాన్ విషయంలో ఓపెన్ వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. ఒకవేళ చైనా తైవాన్ ఫై యుద్దానికి దిగితే మాత్రం ఇక చైనా తన వినాశనానికి తానే  సిద్ధం అయినట్లు అంటూ అమెరికా స్టేట్మెంట్ ఇవ్వడం సంచలనంగా మారింది. ఒక రకంగా ఇది నిజమేనని అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే తైవాన్ పై యుద్ధానికి దిగి చైనా గెలవచ్చు గాని ప్రపంచ దేశాలు మాత్రం చైనాను పూర్తిగా ఐసోలేట్ చేసే  అవకాశం ఉందని.. ఒక రకంగా ఆర్థిక యుద్ధం చేసే అవకాశం కూడా లేకపోలేదు అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: